న్యూఢిల్లీ: ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ... బీజేపీ మంత్రి కుటుంబ సభ్యుడొకరికి ఉద్యోగం ఇవ్వజూపారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుజ్రీవాలా డిమాండ్ చేశారు.
'లలిత్ గేట్'లో ఆధారాలన్నీ ప్రజల ముందు పెట్టాలన్నారు. లలిత్ మోదీ ఏవిధంగా విదేశాలకు పారిపోయారో, ఆయనకు ఎవరెవరూ సహకరించారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాజాగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని లలిత్ మోదీ వివాదంలోకి లాగారు.
'లలిత్ గేట్' ఆధారాలన్నీ బయటపెట్టాలి: కాంగ్రెస్
Published Wed, Jul 1 2015 2:26 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM
Advertisement
Advertisement