
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు అతి తక్కువగా పెరిగాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి అన్నారు. సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రాలతో కేంద్రం సంబంధాలు సాగిస్తోందని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో చమురు ధరలు 30 శాతం మాత్రమే పెరిగాయని, 80 శాతం కాదని తెలిపారు.
‘దశాబ్దాలుగా బేసిక్ శాలరీలు పెరిగాయి. వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఉచిత పథకాలను అందిస్తోంది. కరోనా సంక్షోభం నుంచి మనం ఇంకా కోలుకోలేదు. దేశంలో 80 కోట్ల మందికి ఇప్పటికీ ఆహారం అందిస్తున్నాం. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య కారణంగా చమురు ధరలు బ్యారెల్‌కు 19.56 నుంచి 130 డాలర్లకు పెరిగాయి. కేంద్రం పెట్రోల్-డీజిల్‌పై రూ.32 ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తోంది. దీపావళికి ముందు ఎక్సైజ్ సుంకం తగ్గించాం. దీంతో చమురు ధరలు తగ్గాయి. (క్లిక్: ప్యాసింజర్ రైళ్ల రద్దు.. ఆలస్యం! కారణం ఏంటంటే..)
ఇంధన ధరల తగ్గింపు విషయంలో కేంద్రం తన బాధ్యతను స్వీకరించింది. రాష్ట్రాలు కూడా తమ బాధ్యతను నిర్వర్తించాలి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు 0.2 శాతానికి మించిలేవు. నిబంధనలు ఒప్పుకుంటే ఎక్కువ శాతం ముడి చమురు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేశ ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడబోమ’ని హర్‌దీప్ సింగ్ పూరి అన్నారు. (క్లిక్: ఢిల్లీకి సర్కార్‌కు బొగ్గు కష్టాలు.. 24 గంటల విద్యుత్ డౌటే!)
Comments
Please login to add a commentAdd a comment