India's Retail Inflation Rose to 4.48 Per Cent in October 2021: పెట్రోలు ధరల ఎఫెక్ట్‌తో అక్టోబరులో నిత్యవసర వస్తువుల ధరలు భగ్గుమన్నాయి. గత ఆరునెలలుగా అదుపులోకి వస్తున ద్రవ్యోల్బణం అక్టోబరులో పెంచిన ధరలతో ఒక్కసారిగా గాడి తప్పింది. రాయిటర్స్ సంస్థ తాజాగా చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై రాయిటర్స్ వార్తా సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలతో నవంబరు 8, 9 తేదీల్లో సర్వే చేపట్టింది. అదేవిధంగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డేటాతో వాటిని క్రోడీకరించి సర్వే ఫలితాలను విడుదల చేసింది.
కరోనా సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతూ ద్రవ్యోల్బణం సెప్టెంబరు నాటికి తగ్గిపోతూ వచ్చింది 4.35 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత వచ్చే నెలల్లో ఇది మరింతగా తగ్గవచ్చనే అంచనాలు ఉన్న తరుణంలో అక్టోబరులో పెట్రోలు, డీజిల్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో అదుపులోకి వస్త్తున్న ద్రవ్యోల్బణం కాస్తా మరోసారి పైకి చేరుకుంది. అక్టోబరులో రిటైల్ ఇన్‌ఫ్లాషన్ (చిల్లర ద్రవ్యోబ్బణం) ఏకంగా 4.48 శాతానికి చేరుకుంది. అయితే రిజర్వ్‌బ్యాంక్ లెక్కల ప్రకారం ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్యన ఉంటే పర్వాలేదని చెబుతున్నాయి.
పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల భారం నిత్యవసర వస్తువుల ధరలపై నేరుగా ప్రభావం చూపించింది. ఫుడ్ ప్రైజ్ ఇండెక్స్ సెప్టెంబరులో 0.68 శాతం ఉండగా అక్టోబరు ఫ్యూయల్ ఛార్జీల పెంపుతో ఒక్కసారిగా 0.85 శాతానికి చేరుకుంది. ఇక ఫ్యూయల్ లైట్ కేటగిరిలో ద్రవ్యోల్బణం ఏకంగా 14.35 శాతానికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంకు లెక్కలను మించి మరీ ఫ్యూయల్‌లో ద్రవ్యోల్బణం పెరిగి పోవడంతో కేంద్రం దిగి వచ్చి లీటరు పెట్రోలుపై రూ.5 డీజిల్‌పై రూ,.10 వంతున ఛార్జీలు తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment