సాక్షి, ముంబై : వరుస బాదుడు తరువాత మధ్యలో కాస్త శాంతించినా పెట్రో ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. గత ఐదురోజులుగా భగ్గుమంటున్న పెట్రోలు ధర వరుసగా ఆరో రోజు మంగళవారం కూడా పెరిగింది. ఆగస్టు 16 నుండి చమురు కంపెనీలు (ఆగస్టు 19 తప్ప) మెట్రోల్లో పెట్రోల్ ధరలను పెంచుతున్నాయి. అయితే, దాదాపు ఒక నెలరోజుల నుంచి డీజిల్ ధరలో మార్పులేదు. మంగళవారం ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో పెట్రోల్ రేటు 9-11 పైసలు పెరిగింది.
పెట్రోల్ ధర లీటరుకు
ఢిల్లీలో 81.73రూపాయలు
ముంబైలో 88.39 రూపాయలు
చెన్నైలో 84.73 రూపాయలు
కోల్‌కతాలో 83.24 రూపాయలు
హైదరాబాద్‌లో 84.94 రూపాయలు
బెంగళూరులో 84.39 రూపాయలు
డీజిల్ ధర లీటరుకు
ఢిల్లీలో 73.56 రూపాయలు
ముంబైలో 80.11 రూపాయలు
చెన్నైలో 78.86 రూపాయలు
కోల్‌కతాలో 77.06 రూపాయలు
హైదరాబాద్‌లో 80.17 రూపాయలు
బెంగళూరులో 77.88 రూపాయలు
ఆసియా , ఐరోపాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుఎస్ గల్ఫ్ తీరంలో వ్యాపారులు భారీగా ఉత్పత్తి కోతలు విధించడంతో ముడి చమురు ధరలు మండుతున్నాయని రాయిటర్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment