సాక్షి, న్యూఢిల్లీ: స్వల్ప విరామం తరువాత పెట్రోలు ధరలు మళ్లీ జోరందుకున్నాయి. వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా పెట్రోలు ధరను పెంచుతూ ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మెట్రో నగరాల్లో లీటరు పెట్రోలు ధరపై 11 పైసలు వరకు పెంచాయి. హైదరాబాదులో 11 పైసలు, ముంబై, కోల్‌కతాలో పెట్రోల్ ధర 10 పైసలు పెరగగా, చెన్నైలో 9 పైసలు పెరిగింది. 13 రోజుల్లో చమురు లీటరు పెట్రోలు ధర 1.51 పైసలు పెరిగింది. మరోవైపు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న డీజిల్ ధరలు ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. (హైదరాబాద్‌లో రూ. 85 దాటిన పెట్రోలు )
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 81.94 రూపాయలకు చేరింది. డీజిల్ ధర రూ.73.56 పైసలుగా ఉంది.
హైదరాబాద్ లో పెట్రోలు ధర లీటరుకు రూ. 85.15
చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 84.91
Comments
Please login to add a commentAdd a comment