petro price
-
Sakshi Cartoon: దీంట్లో పెట్రోల్ ధరల తగ్గుదల గురించి ఉండదయ్యా! వెళ్లు!
దీంట్లో పెట్రోల్ ధరల తగ్గుదల గురించి ఉండదయ్యా! వెళ్లు! -
ధరల పెరుగుదలను కేంద్రం నియంత్రించాలి: రాహుల్ గాంధీ
-
‘10 రోజుల్లో 9సార్లు పెట్రో ధరలను పెంచారు’
ఢిల్లీ: చమురు, గ్యాస్ ధరల పెరుగుదలపై కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టింది. వరుసగా పెట్రో ధరలను పెంచడంపై కాంగ్రెస్ పార్టీ నిరసనను తీవ్రతరం చేసింది. దీనిలో భాగంగా ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఎంపీలతో కలిసి ధర్నాలో రాహుల్ పాల్గొన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. చమురు ధరలు 10 రోజుల్లో9సార్లు పెరిగాయి. ధరల పెరుగుదలను కేంద్రం నియంత్రించాలి. తక్షణమే పెట్రో ధరలను తగ్గించాలి’ అని డిమాండ్ చేశారు. -
Sakshi Cartoon: పెట్రోవాత తప్పదు- పరోక్షంగా పేర్కొన్న కేంద్రం
ఎన్నో వాతలు భరించారు.. ఇదో లెక్కా వాళ్లకు ప్రత్యక్షంగా చెప్పినా ఫీలవరు సార్!. -
ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రో సెగ
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగినప్పటికి దేశంలో ఇంధన ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు దాదాపు రెండు నెలలుగా సవరించలేదు. ఇందుకు ప్రధాన కారణం అందరూ భావిస్తున్నట్లు దేశంలో ఎన్నికలు జరగడమే. మే 2న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే ఇందన ధరలో మార్పు రావొచ్చు. నాలుగు రాష్ట్రాలలో, ఒక కేంద్రపాలిత ప్రాంతాలలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగిన దేశంలోని కంపెనీలు పెంచలేదు. ప్రస్తుతం ఎన్నికల వల్ల ఏర్పడిన నష్టాలను తిరిగి పూడ్చుకోవడానికి ప్రభుత్వ-చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉంది. అలాగే డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల నష్టాలను పూడ్చడానికి డీజిల్, పెట్రోల్ ధరలను దశలవారీగా కనీసం రూ.2-3 పెంచాలని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఓఎంసిలు ఆలోచిస్తున్నాయి. రేటు పెంపు అనేది మే మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27 నుంచి పెట్రో ధరలను పెంచకపోవడంతో త్వరలోనే పెట్రో షాక్ లకు వాహనదారులు సిద్ధం కావాలనే సంకేతాలు వస్తున్నాయి. చూడాలి మరి కేంద్రం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకునేది. 2021లో పెట్రోల్, డీజిల్ ధరలను 26 రెట్లు పెంచారు. పెట్రోల్ ధర లీటరుకు 7.46 రూపాయలు, డీజిల్ రేట్లు వరుసగా లీటరుకు 7.60 రూపాయలు పెరిగాయి. చదవండి: ఈ ఫోటో ఖరీదు రూ.3.7 కోట్లు.. ఎందుకింత రేటు? -
పెట్రోలు ధర జోరు
సాక్షి, న్యూఢిల్లీ: స్వల్ప విరామం తరువాత పెట్రోలు ధరలు మళ్లీ జోరందుకున్నాయి. వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా పెట్రోలు ధరను పెంచుతూ ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మెట్రో నగరాల్లో లీటరు పెట్రోలు ధరపై 11 పైసలు వరకు పెంచాయి. హైదరాబాదులో 11 పైసలు, ముంబై, కోల్‌కతాలో పెట్రోల్ ధర 10 పైసలు పెరగగా, చెన్నైలో 9 పైసలు పెరిగింది. 13 రోజుల్లో చమురు లీటరు పెట్రోలు ధర 1.51 పైసలు పెరిగింది. మరోవైపు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న డీజిల్ ధరలు ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. (హైదరాబాద్‌లో రూ. 85 దాటిన పెట్రోలు ) తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 81.94 రూపాయలకు చేరింది. డీజిల్ ధర రూ.73.56 పైసలుగా ఉంది. హైదరాబాద్ లో పెట్రోలు ధర లీటరుకు రూ. 85.15 చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 84.91 -
జడేజా 86 కన్నా పెట్రోలే టాప్
న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో 86 పరుగులతో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ సోషల్ మీడియా బాస్, నటి రమ్య( దివ్యా స్పందన) మాత్రం జడేజావి అత్యధిక స్కోర్ కాదంటున్నారు. పెట్రోల్ ధర 87 కన్నా జడేజా ఒక పరుగు వెనకంజలో ఉన్నారని వ్యంగ్యాస్త్రం సంధించారు. ‘రవీంద్ర జడేజా 86 పరుగులు భారత రెండోవ అత్యధిక పరుగులు. టాప్ స్కోర్ వచ్చేసి పెట్రోల్ 87’ అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ చిత్రంలోని ఫొటోలను పెట్రోల్ ధరలతో పోల్చుతూ షేర్ చేశారు. ఆమిర్ ఖాన్‌లా పెట్రో ధరలు కూడా పెరిగాయంటూ సెటైర్ వేశారు. యూపీఎ గవర్నమెంట్లో సిక్స్ ప్యాక్‌తో ఫిట్‌గా ఉన్న అమీర్ ఖాన్.. ఎన్డీఏ గవర్నమెంట్లో పెద్దవాడయ్యాడని పెరుగుతూ వచ్చిన పెట్రోల్ ధరలను పరోక్షంగా ప్రస్తవించారు. నవ్వును తెప్పిస్తున్న ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ బంద్‌కు సుమారు 21 పార్టీలు మద్దతు తెలిపాయి. దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. #MehangiPadiModiSarkar #BharatBandh pic.twitter.com/pRsiMyH4Nf — Divya Spandana/Ramya (@divyaspandana) September 10, 2018 Ravindra Jadeja at 86 was India's second highest scorer. The highest remains petrol at 87. #EngvInd #MehangiPadiModiSarkar — Divya Spandana/Ramya (@divyaspandana) September 10, 2018 -
పెరిగిన పెట్రో ధరలు
–పెరగనున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు నెల్లూరు(పొగతోట): అంతర్జాతీయ స్థాయిలో క్రుడాయిల్ ధరలు పెరగడంతో పెట్రోలు, డిజిల్ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై రూ 3.38 పైసలు, డిజిల్‌పై రూ.2.67పైసలు పెంచింది. పెరిగిన ధరలు బుధవారం ఆర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో వినియోగదారులపై రోజుకు రూ.36 నుంచి రూ.40 లక్షల భారం పడుతుంది. పెరిగిన ధరల ప్రకారం పెట్రోలు రూ.70.50లు పైన, డిజిల్ రూ.60.75లు పైన ఉండవచ్చు. ప్రస్తుతం పెట్రోలు లీటర్ రూ.65.97 పైసలు, డిజిల్ రూ.57.03పైసలుగా ఉన్నాయి. జిల్లాలోని వినియోగదారులపై నెలకు రూ.12 కోట్లకుపైగా భారం పడుతుంది. జిల్లాలో సుమారు 280కిపైగా పెట్రోలు బంకులున్నాయి. నిత్యం 4 లక్షల లీటర్ల పెట్రోలు, 6.50 లక్షల లీటర్ల డిజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో లీటర్‌కు రూ.4 అధికం. దీంతో పాటు నిత్యావసరసరుకులు, కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉంది. -
ఇవేనా మంచి రోజులు?
లక్నో:నరేంద్ర మోదీ సర్కారు సాధారణ ప్రజల సమస్యలు తీర్చే విధంగా పనిచేయడం లేదని కాంగ్రెస్ మరోసారి మండిపడింది. ఇప్పటికే రైతులు అకాల వర్షాలతో కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటే ప్రధాని మోదీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించింది. శుక్రవారం మరోసారి పెరిగిన పెట్రో ధరలతో ప్రజలపై మరింత భారం పడతున్నా.. కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్మల్ ఖాత్రి విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మంచి రోజులు(అచ్చీ దిన్) వచ్చాయని చెబుతున్న మోదీ దీనికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇవేనా మోదీ చెప్పే మంచి రోజులు అని నిలదీశారు. యూపీఏ హయాంలో అంతర్జాతీయంగా తగ్గిన పెట్రోల్ ధరలు.. ఇప్పుడు దేశీయంగా ఎందుకు పెరుగుతున్నాయో?అర్ధం కావడం లేదన్నారు. పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ పెట్రో ధరల పెంపు
-
మళ్లీ పెట్రో ధరల పెంపు
పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి. పెట్రోలుపై లీటరుకు రూ. 3.13, డీజిల్‌పై లీటరుకు రూ. 2.71చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో పెట్రోలు లీటరు ధర రూ. 75పైగా వెళ్తుంది. ఏప్రిల్ 30వ తేదీన ఒకసారి పెట్రో ధరలను పెంచిన విషయం తెలిసిందే. అప్పట్లో పెట్రోలు ధర లీటరుకు 3.96 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు 2.37 రూపాయల చొప్పున పెరిగాయి. అంతకుముందు ఏప్రిల్ 2వ తేదీన పెట్రోల్‌పై 46 పైసలు, డీజిల్‌పై 1.21 రూపాయలు తగ్గించారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ పెట్రోలు ధరను పది విడతల్లో మొత్తంగా రూ. 17.11 తగ్గించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ డీజిల్ ధరను ఆరు విడతల్లో రూ. 12.96 తగ్గించారు. -
తగ్గుతున్నా బాదుడేనా?
పెట్రోలు, డీజిల్ ధరలపై జనానికి లేదా ఊరట? అంతర్జాతీయంగా పతనమవుతున్న ధరలు ఆ లాభాన్ని పీల్చేస్తున్న కేంద్రం, రాష్ట్రాలు, చమురు కంపెనీలు గత జూన్ నుంచి చూస్తే అంతర్జాతీయ ధర సగానికి సగం పతనం రిటైల్‌లో మాత్రం పెట్రోలుపై 15%, డీజిల్‌పై 12% తగ్గింపు ఒకవైపు సబ్సిడీ మిగులుతున్నా... భారీగా పన్నులు వేసిన కేంద్రం సబ్సిడీ ఆదా రూ.35 వేల కోట్లు; 5 నెలల్లో పన్నుల లాభం 26వేల కోట్లు మరోవంక రూ.4 మేర అదనపు వ్యాట్ వడ్డించిన ఏపీ, తెలంగాణ మరో 3 రూపాయల లాభం వేసుకున్న చమురు కంపెనీలు ఎందుకంటే ధర పెరిగితే జనం బాధపడతారు కానీ... తగ్గించకపోతే బాధపడతారా? అనేది సర్కారు లాజిక్కు. ఈ లాజిక్కు విలువ అక్షరాలా నెలకు ఐదు వేలకోట్ల రూపాయలపైనే. ఒక అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఐదు నెలల్లో... అంటే నవంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకూ పెట్రోలు, డీజిల్‌పై విధించిన అదనపు పన్నుల వల్ల సర్కారు ఖజానాకు ఏకంగా రూ.26,000 కోట్లు వచ్చిపడుతున్నాయి. మరి ఇదంతా జనం జేబుల్లో ఉండాల్సిన సొమ్మేగా!! యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు పెట్రోలు, డీజిల్‌పై భారీ సబ్సిడీ భారాన్ని మోసింది. తరవాత మెల్లగా పెట్రోలు ధరలు పెంచుతూ... చివరకు సబ్సిడీని తొలగించి మార్కెట్ ధరలతో సరిసమానం చేసేసింది. అక్కడి నుంచి అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పాటే మన ధరలూ కదలటం మొదలెట్టాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరగటం... అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గటం. అయితే డీజిల్‌పై కూడా నెలకు అర్ధరూపాయి పెంచటాన్ని యూపీఏ ప్రభుత్వం ఆరంభించింది. నొప్పి తెలియకుండా భారం మోపటం మొదలెట్టింది. అలా 18 నెలలపాటు రూ.9 పెంచాక... నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో అవి మార్కెట్ ధరల సమీపానికి వచ్చాయి. ఇంతలో ఉన్నట్టుండి అంతర్జాతీయంగా ధరలు పతనం కావటం మొదలెట్టాయి. ఇది మోదీ ప్రభుత్వానికి కలిసివచ్చింది. అంతర్జాతీయ ధరలు తగ్గినా... ఇక్కడ రిటైల్ ధరల్ని తగ్గించకపోవటంతో గతేడాది అక్టోబర్‌లో డీజిల్ ధరలు కూడా మార్కెట్ ధరలతో సమానమయ్యాయి. దీంతో అప్పటి నుంచి డీజిల్‌పై కూడా సబ్సిడీ మాయమయింది. ఇటీవలి బడ్జెట్లో ప్రభుత్వం చెప్పిన అంచనాల ప్రకారమే ఈ ఏడాది క్రూడ్ ధరల తగ్గుదల వల్ల దాదాపు రూ. 35,000 కోట్ల సబ్సిడీ సొమ్ము ఆదా అవుతోంది!!. - సాక్షి, బిజినెస్ విభాగం లాభాన్ని పీల్చేస్తున్న కేంద్రరాష్ట్రాలు, చమురు సంస్థలు ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతుండగా ఆ ప్రయోజనాన్ని పూర్తిగా ప్రజలకు బదలాయించకుండా ప్రభుత్వాలు పీల్చేశాయి. కేంద్రం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని దాదాపు రెట్టింపు చేసేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలకు పెట్రోల్, డీజిల్ ధరలపై స్వేచ్ఛనివ్వడంతో క్రూడ్ ధర పతనం దరిమిలా ఆగస్టు నుంచి అవి కూడా రిటైల్ ధరల్ని తగ్గించటం మొదలెట్టాయి. ఓ మూడు నెలలు తగ్గించగానే... హఠాత్తుగా నవంబర్ నుంచి ఈ తగ్గింపును అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవడం మొదలెట్టాయి. కేంద్రం నవంబర్ నుంచి నాలుగు దఫాలు ఎక్సైజ్ సుంకం పెంచేసి లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.7.75, డీజిల్‌పై రూ.6.5 వడ్డించేసింది. దాంతో ప్రస్తుతం ఎక్సైజ్ సుంకం లీటరు పెట్రోలుపై రూ.17కు, డీజిల్‌పై రూ.10.50కి చేరింది. దీనికితోడు ధర తగ్గిపోవటం వల్ల తమ వాటా పన్ను తగ్గుతోందని భావించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.4 చొప్పున వ్యాట్‌ను (వాల్యూ యాడెడ్ ట్యాక్స్) వడ్డించేశాయి. చిత్రమేంటంటే సందట్లో సడేమియా రీతిన తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా మూడు రోజుల కిందట చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా లీటరుపై రూ.3 చొప్పున ధరను పెంచేశాయి. మొత్తమ్మీద గడిచిన ఐదారు నెలల్లో వినియోగదారుడికి లీటరు పెట్రోలుపై రూ.15, డీజిల్‌పై 13.50 మిగలాల్సి ఉన్నా దాన్ని కేంద్రం, రాష్ట్రాలు, చమురు కంపెనీలు కలిసి పీల్చేశాయి. అదీ జరి గింది. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటేంటంటే దేశంలోని ఏ రాష్ట్రం లోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాదిరి పెట్రోల్, డీజిల్‌పై 34 శాతం వ్యాట్ లేదు. సబ్సిడీ మిగిలినా.. సంతృప్తి లేదు.. నిజానికి ధరల్ని మార్కెట్‌కు వదిలేసినపుడు అంతర్జాతీయ హెచ్చుతగ్గులకు అనుగుణంగా మన ధరలూ కదలాలి. మరి గతేడాది జూన్ నుంచి చూసుకున్నపుడు అంతర్జాతీయంగా భారత్ కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ ధరలు దాదాపు సగానికి పతనమయ్యాయి. కానీ మన రిటైల్ ధరలు 12-15 శాతం తప్ప ఎక్కువ తగ్గలేదు! కారణమేంటంటే... పెరిగినప్పుడల్లా జనంపై భారం మోపిన ప్రభుత్వం, తగ్గినపుడు మాత్రం ఆ లాభాన్ని తన ఖాతాలో వేసుకోవటం మొదలెట్టింది. ఒకవైపు సబ్సిడీలు తొలగించేసి... మరోవైపు ధరలు కూడా తగ్గించకుండా ప్రభుత్వం తన ఖజానా నింపుకోవటానికి ప్రాధాన్యమివ్వటమే ఇక్కడ వినియోగదారులకు మింగుడు పడని అంశం. పెరిగితే అంతే సంగతులు! ఇటీవలి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఓ విన్యాసం చేశారు. పెట్రోలు, డీజిల్‌పై పెంచిన ఎక్సైజ్ సుంకం నుంచి లీటరుకు రూ.4 చొప్పున రోడ్డు సెస్సుకు బదలాయిస్తున్నట్లు చెప్పారు. అంటే లీటరుకు రూ.4 చొప్పున రోడ్డు సెస్సు ఖాతాలో కనిపిస్తుందన్న మాట. అయితే వెంటనే ఆర్థిక శాఖ బాంబు పేల్చింది. రూ.4 బదలాయింపుతో ఎక్సైజ్ సుంకం మామూలు స్థాయికి చేరిందని, భవిష్యత్తులో పెట్రో ధరలు పెరిగితే ఈ సుంకం నుంచి సర్దుబాటు చేయటం అసాధ్యం కనక ధరల పెంపే శరణ్యమని స్పష్టంచేసింది. ఔరా!!