జడేజా 86 కన్నా పెట్రోలే టాప్‌  | Congress Leader Divya Spandana Tweet Jadeja 86 Was Not India Highest Score | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 10 2018 1:17 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Leader Divya Spandana Tweet Jadeja 86 Was Not India Highest Score - Sakshi

న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో 86 పరుగులతో టీమిండియా ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా టాప్‌ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా బాస్‌, నటి రమ్య( దివ్యా స్పందన) మాత్రం జడేజావి అత్యధిక స్కోర్‌ కాదంటున్నారు. పెట్రోల్‌ ధర 87 కన్నా జడేజా ఒక పరుగు వెనకంజలో ఉన్నారని వ్యంగ్యాస్త్రం సంధించారు. ‘రవీంద్ర జడేజా 86 పరుగులు భారత రెండోవ అత్యధిక పరుగులు. టాప్‌ స్కోర్‌ వచ్చేసి పెట్రోల్‌ 87’ అని ట్వీట్‌ చేశారు.

మరో ట్వీట్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ ‘దంగల్‌’  చిత్రంలోని ఫొటోలను పెట్రోల్‌ ధరలతో పోల్చుతూ షేర్‌ చేశారు. ఆమిర్‌ ఖాన్‌లా పెట్రో ధరలు కూడా పెరిగాయంటూ సెటైర్‌ వేశారు. యూపీఎ గవర్నమెంట్‌లో సిక్స్‌ ప్యాక్‌తో ఫిట్‌గా ఉన్న అమీర్‌ ఖాన్‌.. ఎన్డీఏ గవర్నమెంట్‌లో పెద్దవాడయ్యాడని పెరుగుతూ వచ్చిన పెట్రోల్‌ ధరలను పరోక్షంగా ప్రస్తవించారు. నవ్వును తెప్పిస్తున్న ఈ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. పెరిగిన పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఈ బంద్‌కు సుమారు 21 పార్టీలు మద్దతు తెలిపాయి. దేశవ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement