
మళ్లీ పెట్రో ధరల పెంపు
పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి. పెట్రోలుపై లీటరుకు రూ. 3.13, డీజిల్పై లీటరుకు రూ. 2.71చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో పెట్రోలు లీటరు ధర రూ. 75పైగా వెళ్తుంది.
ఏప్రిల్ 30వ తేదీన ఒకసారి పెట్రో ధరలను పెంచిన విషయం తెలిసిందే. అప్పట్లో పెట్రోలు ధర లీటరుకు 3.96 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు 2.37 రూపాయల చొప్పున పెరిగాయి. అంతకుముందు ఏప్రిల్ 2వ తేదీన పెట్రోల్‌పై 46 పైసలు, డీజిల్‌పై 1.21 రూపాయలు తగ్గించారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ పెట్రోలు ధరను పది విడతల్లో మొత్తంగా రూ. 17.11 తగ్గించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ డీజిల్ ధరను ఆరు విడతల్లో రూ. 12.96 తగ్గించారు.