పెరిగిన పెట్రో ధరలు
-
–పెరగనున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు
నెల్లూరు(పొగతోట):
అంతర్జాతీయ స్థాయిలో క్రుడాయిల్ ధరలు పెరగడంతో పెట్రోలు, డిజిల్ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై రూ 3.38 పైసలు, డిజిల్‌పై రూ.2.67పైసలు పెంచింది. పెరిగిన ధరలు బుధవారం ఆర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో వినియోగదారులపై రోజుకు రూ.36 నుంచి రూ.40 లక్షల భారం పడుతుంది. పెరిగిన ధరల ప్రకారం పెట్రోలు రూ.70.50లు పైన, డిజిల్ రూ.60.75లు పైన ఉండవచ్చు. ప్రస్తుతం పెట్రోలు లీటర్ రూ.65.97 పైసలు, డిజిల్ రూ.57.03పైసలుగా ఉన్నాయి. జిల్లాలోని వినియోగదారులపై నెలకు రూ.12 కోట్లకుపైగా భారం పడుతుంది. జిల్లాలో సుమారు 280కిపైగా పెట్రోలు బంకులున్నాయి. నిత్యం 4 లక్షల లీటర్ల పెట్రోలు, 6.50 లక్షల లీటర్ల డిజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో లీటర్‌కు రూ.4 అధికం. దీంతో పాటు నిత్యావసరసరుకులు, కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉంది.