న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగినప్పటికి దేశంలో ఇంధన ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు దాదాపు రెండు నెలలుగా సవరించలేదు. ఇందుకు ప్రధాన కారణం అందరూ భావిస్తున్నట్లు దేశంలో ఎన్నికలు జరగడమే. మే 2న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే ఇందన ధరలో మార్పు రావొచ్చు. నాలుగు రాష్ట్రాలలో, ఒక కేంద్రపాలిత ప్రాంతాలలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగిన దేశంలోని కంపెనీలు పెంచలేదు.
ప్రస్తుతం ఎన్నికల వల్ల ఏర్పడిన నష్టాలను తిరిగి పూడ్చుకోవడానికి ప్రభుత్వ-చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉంది. అలాగే డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల నష్టాలను పూడ్చడానికి డీజిల్, పెట్రోల్ ధరలను దశలవారీగా కనీసం రూ.2-3 పెంచాలని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఓఎంసిలు ఆలోచిస్తున్నాయి. రేటు పెంపు అనేది మే మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27 నుంచి పెట్రో ధరలను పెంచకపోవడంతో త్వరలోనే పెట్రో షాక్ లకు వాహనదారులు సిద్ధం కావాలనే సంకేతాలు వస్తున్నాయి. చూడాలి మరి కేంద్రం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకునేది. 2021లో పెట్రోల్, డీజిల్ ధరలను 26 రెట్లు పెంచారు. పెట్రోల్ ధర లీటరుకు 7.46 రూపాయలు, డీజిల్ రేట్లు వరుసగా లీటరుకు 7.60 రూపాయలు పెరిగాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment