సాక్షి, న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో సెంచరీ దాటి పరుగులు పెడుతున్న ఇంధన ధరలను వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. మంగళవారం పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్ 23 పైసలు పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.49, లీటర్ డీజిల్ రూ.85.38కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.101కి చేరువైంది. అటు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.105.52కు చేరగా, డీజిల్ ధర లీటరుకు ధర రూ.98.32 పలుకుతోంది.
ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు
ముంబైలో పెట్రోల్ రూ.100.72, డీజిల్ రూ.92.69
చెన్నైలో పెట్రోల్ రూ.95.99, డీజిల్ రూ.90.12
కోల్‌కతాలో పెట్రోల్ రూ.94.50, డీజిల్ రూ.88.23
బెంగళూరులో పెట్రోల్ రూ.97.64, డీజిల్ రూ.90.51
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.98.20, డీజిల్ రూ.93.08
అమరావతిలో పెట్రోలు రూ. 100.72, డీజిల్ రూ. 94.99
వైజాగ్‌లో పెట్రోలు రూ. 99.42, డీజిల్ రూ. 93.73
Comments
Please login to add a commentAdd a comment