Fuel Rates Today: రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఒక‍్కసారిగా బ్యారెట్ క్రూడాయిల్ ధరలు 140 డాలర్లకు చేరుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన కేంద్రం..ఇప్పుడు ధరల పెంపుకు చమురు సంస్థలు సిద్ధమయ్యాయి. రెండు రోజుల పాటు వరుసగా పెంచిన చమురు సంస్థలు, ధరల పెంపుకు ఒక్కరోజు బ్రేక్ గ్యాప్ ఇచ్చి మరోసారి బాదుడు షురూ చేశాయి. దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్ 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి.
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.112.51, డీజిల్ రూ.96.70గా ఉన్నాయి. చెన్నైలో 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.93.71, కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.34 (84 పైసలు), డీజిల్ రూ.91.42 (80 పైసలు)కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.76, డీజిల్ ధర రూ. 98.74 గా ఉంది.
దేశంలో గతేడాది నవంబర్ 4వ తేదీ తర్వాత మొదటిసారిగా మార్చి 22న పెట్రోల్, డీజిల్ ధరలు అధికమయ్యాయి. మార్చి 23న కూడా చమురు కంపెనీలు ధరలు పెంచాయి. తాజా పెంపుతో మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2.40 పైగా పెరిగాయి.
చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..!
Comments
Please login to add a commentAdd a comment