
పెట్రో ధరల పెంపు అన్యాయం : వైఎస్సార్‌సీపీ
ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతం అవుతున్న ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచడం సబబుకాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
హైదరాబాద్ : ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు సతమతమవుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచడం అన్యాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ధరల పెంపు నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న ధరలు పెంచడం దారుణమని... ధరల పెంపును వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.3.07, డీజిల్ రూ.1.90 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గురువారం నిర్ణయించాయి. పెంచిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే.