
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా దిగి వచ్చాయి. లీటరు పెట్రోలుపై 18 పైసలు, డీజిల్ పై 24 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మంగళవారం వెల్లడించాయి. ఈ తగ్గింపుతో హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 84.75కు డీజిల్ ధర రూ. 79.08 గా ఉది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలుపై 17 పైసలు, డీజిల్ పై 22 పైసల మేరకు ధరలు తగ్గాయి. గత రెండు రోజులలో, పెట్రోల్ డీజిల్ ధర ఢిల్లీలో వరుసగా 31 పైసలు 37 పైసలు తగ్గింది.
అమరావతిలో పెట్రోలు ధర రూ. 86.34 డీజిల్ ధర 80.27 రూపాయలు
ఢిల్లీ పెట్రోల్ ధర లీటరు రూ .81.55, డీజిల్ లీటరు రూ .72.56
ముంబైలో పెట్రోల్ రూ. 88.21 డీజిల్ ధర 79.05 రూపాయలు
చెన్నైలో పెట్రోల్ రూ. 84.57 డీజిల్ 77.91 రూపాయలు
మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ క్షీణించడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర 3 సెంట్లు లేదా 0.1 శాతం తగ్గి 39.58 డాలర్ల వద్ద ఉంది. దీంతో దేశీయంగా పె ట్రోలు ధరలు మరింత దిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. (ఇంధన ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత)
Comments
Please login to add a commentAdd a comment