సాక్షి,ముంబై: నాలుగు రోజుల విరామం తరువాత మళ్లీ పెట్రోలు ధరలు స్వల్పంగా క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు దిగి రావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం (మార్చి 30) స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గిస్తూచమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయించాయి. పెట్రోలుపై లీటరుకు 22 పైసలు , డీజిల్‌పై లీటరుకు 23 పైసలు చొప్పున తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర ప్రస్తుతం లీటరుకు 90.56 రూపాయలుగా ఉంది. డీజిల్ లీటరుకు 80.87 రూపాయలకు చేరింది.
వివిధ మెట్రో నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు
ముంబైలో పెట్రోల్ ధర రూ. 96.98, డీజిల్ ధర 87.96
కోల్‌కతాలో పెట్రోల్ రూ. 90.77 డీజిల్ ధర రూ 83.75 (సోమవారం ధర కంటే 23 పైసలు)
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 92.58(19 పైసలు తగ్గింది)
డీజిల్ ధర రూ. 85.88 22 పైసలు తగ్గింది
హైదరాబాద్ పెట్రోలు ధర రూ. 94.16, డీజిల్ రూ. 88.20
అమరావతి పెట్రోలు ధర రూ. 96.77, డీజిల్ ధర రూ. 90.28
Comments
Please login to add a commentAdd a comment