నిమిషానికి రూ 3,36,420 లాభం | IT Company Earnings profit per minute | Sakshi
Sakshi News home page

నిమిషానికి రూ 3,36,420 లాభం

Published Sat, Feb 6 2016 3:13 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

నిమిషానికి రూ 3,36,420 లాభం - Sakshi

నిమిషానికి రూ 3,36,420 లాభం

న్యూయార్క్: ఒకప్పుడు చమురు కంపెనీలు సంపాదించిన లాభాల కన్నా ఇప్పుడు ఐటి దిగ్గజాలు ఎక్కువగా సంపాదిస్తున్నాయి. ఆపిల్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్...నాలుగు సంస్థలు కలసి క్షణానికి 1,26,000 రూపాయలను, నిమిషానికి 88,20,000 రూపాయలను ఆర్జిస్తున్నాయి. లాభాల్లో వీటిలో అన్నింటికన్నా ముందున్నది ఆపిల్ సంస్థ. గతేడాదిలో ఈ సంస్థ 3,36,420 కోట్ల రూపాయల లాభాలను గడించింది. ఐఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం వల్లనే సంస్థకు ఎక్కువ లాభాలు వచ్చాయి.

గతేడాది చివరి త్రైమాసికంలో ఆపిల్ సంస్థకు 10,85,400 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అదే మైక్రోసాఫ్ట్‌కు గతేడాది డెసెంబర్ 31వ తేదీ నాటికి 31,000 కోట్ల రూపాయల లాభాలను గడించింది. ఫేస్‌బుక్ గతేడాదిలో 6,300 కోట్ల రూపాయల లాభాలను సంపాదించింది. అల్ఫాబెట్, ఆపిల్ మార్కెట్‌ను అధిగమించి ముందుకు దూసుకెళుతోంది.

ఈ వారంలో దాని రెవెన్యూ 547.1 బిలియన్ డాలర్లకు చేరుకొంది. ఏడాది మొత్తంగా లాభాల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పెన్నీ స్టాక్స్ ల్యాబ్ ఓ చార్ట్‌ను రూపొందించింది.  టెక్నాలజీ సంస్థలు ఇంత పెద్ద మొత్తంలో లాభాలను గడిస్తూ ముందుకు దూసుకెళ్లడం  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు మరింత పెరిగిపోవడం సమాజంలో అసహన పరిస్థితులకు దారితీయవచ్చని వారు భావిస్తున్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement