యాక్సిస్ బ్యాంకులో ప్రభుత్వ వాటాల విక్రయం?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను సాధించే క్రమంలో ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకులో ఉన్న 11.7 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది. స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ ది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (సూటీ) ద్వారా ప్రభుత్వానికి ఈ వాటాలు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ప్రభుత్వానికి ఉన్న 27.48 కోట్ల షేర్లను విక్రయిస్తే ఖజానాకు రూ. 11,240 కోట్లు రావొచ్చని అంచనా.