న్యూఢిల్లీ: ఈ–కామర్స్ విధానాన్ని రూపొందించడంపై అంతర్–మంత్రిత్వ శాఖల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. పరిశ్రమ సమ్మిళిత వృద్ధి సాధించడానికి అనువైన పరిస్థితులను కల్పించే వ్యూహాల రూపకల్పన అనేది ఈ విధానం ప్రధాన లక్ష్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
దీని ద్వారా వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా నియంత్రణ విధానాలను క్రమబద్ధీకరించడం, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడం, సరఫరా వ్యవస్థలను సమగ్రపర్చడం, ఈ–కామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను పెంచడం తదితర అంశాలపై అంతర్–మంత్రిత్వ శాఖలు దృష్టి పెడుతున్నాయని సింగ్ వివరించారు.
అటు జాతీయ రిటైల్ వాణిజ్య విధానంపై కూడా డీపీఐఐటీ కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. భౌతిక రిటైల్ రంగం వృద్ధిని ప్రోత్సహించేందుకు, క్రమబద్ధీకరించేందుకు ఉపయోగపడే మార్గదర్శకాలను ఇందులో పొందుపర్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment