న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఈ కామర్స్ సేవల సంస్థ ఎంఎస్‌టీసీ.. ప్రైవేటు సంస్థలకు సైతం తన సేవలను విస్తరించాలని భావిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా పవర్, వేదాంత, ఎల్‌అండ్‌టీతో టైఅప్ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవాళ్లతోనే ఉంటుందని, వీటిని ఎదుర్కొనేందుకు చురుకైన మార్గాలను అన్వేషించాల్సి ఉంటుందని పేర్కొంది.
సమీప భవిష్యత్తులో డిజిటల్‌కు మారిపోవడం కీలకంగా ఉంటుందని, సంస్థ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తుందని ఎంఎస్‌టీసీ చైర్మన్, ఎండీ సురీందర్ కుమార్ గుప్తా 2021–22 వార్షిక నివేదికలో తెలి పారు. దేశంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థగా అవతరించామని, మరిన్ని విభాగాల్లోకి వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment