Ecommerce sector
-
మూడు నగరాలు.. ఆరు గ్రామాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలపై ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు దృష్టి సారించాయి. ప్రస్తుత పండుగల సీజన్లో ఆయా ప్రాంతాల్లో ఆన్లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరగడంతో.. అటువైపు ఈ సంస్థలు దృష్టికేంద్రీకరిస్తున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలకు దూరంగా ఉండే ప్రదేశాల్లో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాల విస్తరణ సవాళ్లతో కూడుకున్నది.అందుకు అనుగుణంగా తమ వ్యూహాల్లో మార్పులు, చేర్పులకు ఈ సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. ఆయా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు అంతబాగా లేకపోవడం, వాతావరణంలో మార్పులు, విస్తీర్ణం ఎక్కువగా ఉండడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఇతర సౌకర్యాల పెంపునకు ఈ సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో తదితర ఈ –కామర్స్ దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ‘ద బిగ్ బిలియన్ డేస్’ సేల్ నిర్వహించింది. ఈ సందర్భంగా 2,800 చిన్న పట్టణాలు, కమలాపురం, వాడర్, సిహోర్, బన్సాతర్ ఖేడా, వెరంగ్టే, భోటా (టయర్–4 సిటీస్ తో సహా) వంటి ప్రాంతాల్లో వాల్యూ–కామర్స్ ప్లాట్‌ఫామ్ షాప్ అమ్మకాల్లో మంచి పురోగతి కనబరిచింది. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నట్టుగా ఈ –కామర్స్ విక్రయాల పెరుగుదలను బట్టి అవగతమౌతోంది.గ్రామీణ ప్రాంతాల నుంచే ఎలక్ట్రాన్రిక్స్, ఫ్యాషన్, మొబైల్, హోం, సౌందర్య సాధనాలకు అధిక డిమాండ్ పెరుగుతున్నట్లుగా ఆయా సంస్థలు గుర్తించాయి. మొత్తం సెల్‌ఫోన్ అమ్మకాల్లో 75 శాతానికి పైగా చిన్న పట్టణాల నుంచి ఉండడంతో.. అక్కడే ఈ సంస్థలు అధికంగా దృష్టి పెడుతున్నాయి. ఇదే సమయంలో.. చిన్నపట్టణాలు, నగరాల్లో ఈ–కామర్స్ సర్వీసులు అంతకంతకు పెరుగుతున్న క్రమంలో.. స్థానికంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన వారికి ఉపాధి అవకాశాలు కూడా పెరగడం కలిసొచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.ప్రస్తుతం పండుగల సీజన్లో.. ఫ్లిప్‌కార్ట్ సంస్థ తొమ్మిది నగరాల్లో 11 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా.. 40 ప్రాంతాల్లో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాల కల్పన జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు స్థానికంగా ఉంటున్న వివిధ వర్గాల ఆర్థిక పురోగతికి దోహదపడుతున్నాయి. ఇవి ప్రధానంగా రవాణా, ప్యాకేజింగ్, రిటైల్ రంగాల్లో వృద్ధికి ఇతోధిక సహాయాన్ని అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్–2024లో భాగంగా (సెపె్టంబర్ 27న మొదలై నెలపాటు సాగింది) ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి డిమాండ్ గణనీయంగా పెరిగినట్టుగా వెల్లడైంది. అమెజాన్ ద్వారా ‘నో–కాస్ట్ ఈఎంఐ’ లావాదేవీలు 40 శాతానికి పైగా పెరిగినట్టు స్పష్టమైంది.మొబైల్స్, వాషింగ్ మెషీన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వీడియో గేమ్‌ల వంటి వాటికి మంచి డిమాండ్ ఏర్పడినట్టుగా తేలింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే 75వ శాతానికి పైగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జరిగినట్టు వెల్లడైంది. అందులోనూ అన్ని ప్రీమియం స్మార్ట్ఫోన్ల విక్రయాలు 70 శాతం (రూ.30 వేలకు పైగా) జరిగాయి. చిన్ననగరాలు, పట్టణాల నుంచి 80 శాతం టీవీ కొనుగోలు ఆర్డర్లు వచి్చనట్టు తెలుస్తోంది.అమెజాన్ తన రెండువేల డెలివరీ స్టేషన్ల ద్వారా మారుమూల ప్రాంతాలను చేరుకునేందుకు ఏర్పాట్లు చేసింది. సముద్రమట్టానికి 1,372 మీటర్ల ఎగువనున్న ఉత్తరాఖండ్ గజోలిలోని మహరిషీ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు సరఫరా చేసిన మొట్టమొదటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా అమెజాన్ రికార్డ్‌ను నెలకొల్పడం విశేషం. ఈ సంస్థ తన వస్తు సరఫరాను అండమాన్ నికోబార్ దీవులకు కూడా విస్తరించింది. భారత రైల్వేలు, ఇండియా పోస్ట్‌ల భాగస్వామ్యంతో అమెజాన్ ఎయిర్ సరీ్వస్‌ను కూడా నిర్వహిస్తోంది. మరోవైపు మీషో సంస్థ కూడా తన మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌తో గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లింది. -
రిలయన్స్‌తో జతకట్టిన ప్రభుత్వరంగ ఈ కామర్స్ సేవల సంస్థ ఎంఎస్టీసీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఈ కామర్స్ సేవల సంస్థ ఎంఎస్టీసీ.. ప్రైవేటు సంస్థలకు సైతం తన సేవలను విస్తరించాలని భావిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా పవర్, వేదాంత, ఎల్అండ్టీతో టైఅప్ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవాళ్లతోనే ఉంటుందని, వీటిని ఎదుర్కొనేందుకు చురుకైన మార్గాలను అన్వేషించాల్సి ఉంటుందని పేర్కొంది. సమీప భవిష్యత్తులో డిజిటల్‌కు మారిపోవడం కీలకంగా ఉంటుందని, సంస్థ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తుందని ఎంఎస్టీసీ చైర్మన్, ఎండీ సురీందర్ కుమార్ గుప్తా 2021–22 వార్షిక నివేదికలో తెలి పారు. దేశంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థగా అవతరించామని, మరిన్ని విభాగాల్లోకి వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు చెప్పారు. -
ఈ-కామర్స్‌పై ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీఈఓ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే మూడు నాలుగేళ్లలో దేశీయ ఈ-కామర్స్ పరిశ్రమ 90-100 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. కరోనాకు ముందు ఈ-కామర్స్ వృద్ధి రేటు 26-27 శాతంగా ఉందని, కరోనా తర్వాత ఇది 30 శాతానికి పెరిగిందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. చైనా ఆన్లైన్ మార్కెట్లో ఈ-కామర్స్ వాటా 25 శాతంగా ఉంటే.. ఇండియాలో 3.5 శాతంగా ఉందని, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 10-25 శాతమని చెప్పారు. (పసిడి డిమాండ్‌కు కరోనా కాటు) రాబోయే కొన్నేళ్లలో దేశీయ ఈ-కామర్స్ మార్కెట్ ఆధునిక రిటైల్ మార్కెట్ల కంటే చాలా పెద్దగా ఉంటుందన్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయని.. ఇది ఈ-కామర్స్ రంగానికి వృద్ధి చోదకాలుగా మారుతాయని పేర్కొన్నారు. కరోనాతో వ్యాపారాలు ఎంత ప్రభావితం అయ్యాయో.. అంతే స్థాయిలో కొత్త అవకాశాలు కూడా తెరుచుకున్నాయని ఆయన పేర్కొన్నారు. కిరాణా వ్యవస్థలో అన్ని పరిమాణాల వ్యాపారాలకు ఆధునిక రిటైల్ మంచి బిజినెస్ అవకాశమని, స్మాల్ బిజినెస్, చేతివృత్తులు వంటివి డిజిటల్ రిటైల్‌తో మంచి చాన్స్‌లుంటాయని.. ఈ దిశలో ఫ్లిప్‌కార్ట్ కృషి చేస్తోందని ఆయన వివరించారు. 2019లో దేశ జనాభాలో 10 శాతం మంది ఆన్లైన్ కొనుగోళ్లు జరిపారని కృష్ణమూర్తి తెలిపారు. లాక్డౌన్ సమయంలో చాలా మంది ఇంట్లోనే ఉండాల్సి రావటంతో కిరాణా, నిత్యావసరాల కొనుగోళ్ల కోసం ఆన్లైన్ మీద ఆధారపడ్డారని.. లాక్డౌన్ తర్వాత కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో వంద పిన్‌కోడ్స్‌లో ఈ-కామర్స్ ఆర్డర్లు వస్తున్నాయని.. 60 శాతానికి పైగా లావాదేవీలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే జరుగుతున్నాయని చెప్పారు. -
ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేశారా?
సాక్షి, ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ముఖ్యంగా బిగ్‌బాస్కెట్ , గ్రోఫర్స్ లాంటి ఆన్ లైన్ గ్రాసరీస్ (కిరణా) సేవల సంస్థలు కూడా తమ డెలివరీలను తాత్కాలికంగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటితో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటివి ఈ కోవలో ఉన్నాయి. దీంతో ఆన్ లైన్ కొనుగోళ్ల పై ఆధారపడిన వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. (చదవండి: అమ్మను సర్ప్రైజ్ చేస్తానని.. అనంత లోకాలకు) ‘ప్రస్తుతానికి సేవలను నిలిపివేశాం..కేంద్ర అధికారుల స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, స్థానిక అధికారుల ఆంక్షల కారణంగా సేవలు తాత్కాలికంగా అందుబాటులో లేవు. త్వరలోనే పునరుద్దిస్తాం’ అనే సందేశం దేశవ్యాప్తంగా చాలామంది బిగ్‌బాస్కెట్ వినియోగదారులకు దర్శనమిస్తోంది. అంతేకాదు ఆర్డర్ రద్దు చేశామని తెలియజేయడానికి చింతిస్తున్నామనే సందేశం కూడా కొంతమంది వినియోగదారులను వెక్కిరిస్తోంది. ప్రభుత్వం అత్యవసర సేవలుగా ప్రకటించినప్పటికీ డెలివరీలను తాత్కాలికంగా ఆపాల్సిన పరిస్థితి ఏర్పడిందని బిగ్‌బాస్కెట్ వెల్లడించింది. ఈ సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని తెలిపింది. (చదవండి: కరోనా వైరస్: ఎందుకంత ప్రమాదకారి?) అంతేకాదు డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు వేధింపులకు గురి కావల్సి వస్తోందని వాపోయింది. తమ డెలివరీ బాయ్స్‌ని పోలీసులు ఆపి ప్రశ్నించడంతోపాటు, కొన్ని సందర్భాల్లో దాడి చేసినట్టు కూడా ఆరోపించింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోవడం ఆపేసి, అవసరమైన వస్తువుల పంపిణీపై మాత్రమే దృష్టి పెట్టామని అమెజాన్ ఇండియా ప్రకటించింది. తక్కువ ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తుల రవాణాను నిలిపివేసినట్టు వెల్లడించింది. లాక్ డౌన్ కారణంగా తమ సేవలను తాత్కాలికంగా రద్దు చేశామని మరో సంస్థ ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అయితే ఈ సంస్థల సేవలు తిరిగి ఎపుడు అందుబాటులోకి వచ్చేది స్పష్టత లేదు. మరోవైపు తాజా పరిమాణాలపై స్పందించిన ఒక నెటిజన్ తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కి ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్ ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌ను తగిన ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందే కేటీఆర్ ఆశిస్తూ ట్వీట్ చేశారు. కాగా కోవిడ్ -19 ను నిరోధించే చర్యల్లో భాగంగా ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటికే పరిమితం కావాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో నిత్యాసరాలకోసం ప్రజలు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఆన్లైన్ సైట్ల ద్వారానే ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, మందులు అన్నీ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. -
బంగారు, వెండి నాణేల విక్రయాల్లోకి నిహార్ ఇన్ఫో
గోల్డ్‌ఎన్‌సిల్వర్.ఇన్ ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ నిహార్ ఇన్ఫో గ్లోబల్ బంగారు, వెండి నాణేలు, వెండి ఆభరణాల విక్రయాల్లోకి ప్రవేశించింది. ఇందుకోసం గోల్డ్‌ఎన్‌సిల్వర్.ఇన్ పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైట్‌ను కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు జీవిత రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే జయసుధ కపూర్ శుక్రవారం ప్రారంభించారు. మార్కెట్ ప్లేస్ విధానాన్ని తాము అనుసరిస్తున్నామని నిహార్ ఇన్ఫో గ్లోబల్ ఎండీ బీఎస్ఎన్ సూర్యనారాయణ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘తయారీ కంపెనీలను మాత్రమే పోర్టల్ ద్వారా బంగారు నాణేలు, పెండెంట్లు, వెండి నాణేలు, ఆభరణాలను విక్రయించేందుకు అనుమతిస్తాం. నాణ్యతలో రాజీ పడకూడదన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. విదేశాల్లో ఉన్న కస్టమర్లూ ఆర్డరు ఇవ్వొచ్చు. ఉత్పత్తుల ధర రూ.500 నుంచి ప్రారంభం. ప్రస్తుతం 500 వరకు ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. కరీంనగర్ ఫిలిగ్రీ వంటి పేరున్న ఉత్పత్తుల విక్రయాలను రానున్న రోజుల్లో ప్రోత్సహిస్తాం’ అని తెలిపారు.