బంగారు, వెండి నాణేల విక్రయాల్లోకి నిహార్ ఇన్ఫో | Nihar Info inks pact with eDukaan Info & Ram Info | Sakshi
Sakshi News home page

బంగారు, వెండి నాణేల విక్రయాల్లోకి నిహార్ ఇన్ఫో

Published Sat, Oct 31 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

బంగారు, వెండి నాణేల విక్రయాల్లోకి నిహార్ ఇన్ఫో

బంగారు, వెండి నాణేల విక్రయాల్లోకి నిహార్ ఇన్ఫో

గోల్డ్‌ఎన్‌సిల్వర్.ఇన్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ నిహార్ ఇన్ఫో గ్లోబల్ బంగారు, వెండి నాణేలు, వెండి ఆభరణాల విక్రయాల్లోకి ప్రవేశించింది. ఇందుకోసం గోల్డ్‌ఎన్‌సిల్వర్.ఇన్ పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైట్‌ను కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు జీవిత రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే జయసుధ కపూర్ శుక్రవారం ప్రారంభించారు. మార్కెట్ ప్లేస్ విధానాన్ని తాము అనుసరిస్తున్నామని నిహార్ ఇన్ఫో గ్లోబల్ ఎండీ బీఎస్‌ఎన్ సూర్యనారాయణ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

‘తయారీ కంపెనీలను మాత్రమే పోర్టల్ ద్వారా బంగారు నాణేలు, పెండెంట్లు, వెండి నాణేలు, ఆభరణాలను విక్రయించేందుకు అనుమతిస్తాం. నాణ్యతలో రాజీ పడకూడదన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. విదేశాల్లో ఉన్న కస్టమర్లూ ఆర్డరు ఇవ్వొచ్చు. ఉత్పత్తుల ధర రూ.500 నుంచి ప్రారంభం. ప్రస్తుతం 500 వరకు ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. కరీంనగర్ ఫిలిగ్రీ వంటి పేరున్న ఉత్పత్తుల విక్రయాలను రానున్న రోజుల్లో ప్రోత్సహిస్తాం’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement