ఈ-కామర్స్ యునికార్న్ ఉడాన్ రూ.2800 కోట్ల మూలధనాన్ని సమీకరించిన తర్వాత తాజాగా 150 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. ఉడాన్ తన సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి, తాజా నిధులతో ఇతర సంస్థలతో తమ భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రణాళిక వేసినట్లు పేర్కొంది.
ఇప్పటివరకు కంపెనీలోని ఎఫ్‌ఎంసీజీ బృందం దేశవ్యాప్తంగా పనిచేసేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కానీ ప్రస్తుతం క్లస్టర్ వారీగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు కంపెనీ ఒక నివేదికలో తెలిపింది. కొన్ని సంవత్సరాలుగా స్థిరమైన వ్యాపారాన్ని నిర్మించడానికి భారీగా పెట్టుబడులు పెట్టామని, వ్యాపారాన్ని మరింత మెరుగుపరచడానికి, స్థిరంగా వృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే అందులో భాగంగా కంపెనీ ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
కంపెనీ తాజాగా నవంబర్‌లో రూ.990 కోట్లమేర కన్వర్టబుల్ నోట్లను సేకరించిన తర్వాత ఉడాన్ 10 శాతం ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. కంపెనీ కార్యకలాపాల్లో వస్తున్న మార్పుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.2800 కోట్లమేర నిధులు సమీకరించింది. గతేడాది జూన్ నుంచి నవంబర్ వరకు 500 మంది ఉద్యోగులను తొలగించింది.
ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి..
ఇదిలా ఉండగా 2025లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)గా స్టాక్‌మార్కెట్‌లోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉడాన్‌ను 2016లో ముగ్గురు ఐఐటీ పూర్వ విద్యార్థులు అమోద్ మాల్వియా, సుజీత్ కుమార్, వైభవ్ గుప్తా స్థాపించారు. వీరు గతంలో ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment