Massive Discount On iQOO Z6 In Amazon Prime Day Sale - Sakshi
Sakshi News home page

Amazon Prime Day Sale: స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు దారులకు బంపరాఫర్‌!

Published Mon, Jul 18 2022 12:38 PM | Last Updated on Mon, Jul 18 2022 1:54 PM

Massive Discount On Iqoo Z6 In Amazon Prime Day Sale - Sakshi

స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు దారులకు శుభవార్త. జులై 23 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో పలు స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు అమెజాన్‌ తెలిపింది. 

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటున్న ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లైన 5జీ ఐక్యూఓఓ జెడ్‌6, 5జీ ఐక్యూఓఓ నియో6, ఐక్యూఓఓ జెడ్‌6 ప్రోలపై రూ.10వేల వరకు డిస్కౌంట్‌ సొంతం చేసుకోవచ్చు. 

ఐక్యూఓఓ జెడ్‌6 ఫోన్‌ ధర రూ.14,999 ఉండగా ఎంపిక చేసిన బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌లపై అదనంగా కూపన్‌ బెన్ఫిట్స్‌, ఇన్‌స్టంట్‌ బ్యాంక్‌ డిస్కౌంట్‌ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు పలు స్మార్ట్‌ ఫోన్‌ మోడళ్లపై ఎక్ఛేంజ్‌ ఆఫర‍్లను దక్కించుకోవచ్చు.   
 
ఐక్యూఓఓ జెడ్‌6 ఫోన్‌ 6జీబీ ర్యామ్‌ ప్లస్‌ 128జీ స్టోరేజ్‌ ఫోన్‌ను 19శాతం డిస్కౌంట్‌తో రూ.16,999కే పొందవచ్చు. 

ఐక్యూఓఓ జెడ్‌6 ప్రో లెజియన్ స్కై 6జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ పై 14శాతం డిస్కౌంట్‌తో ధర రూ.23999కే కొనుగోలు చేయోచ్చు. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌పై రూ.3వేల ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. 

అదే విధంగా ఐక్యూఓఓ నియో6..6జీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌పై 14శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. రూ.5వేల డిస్కౌంట్‌తో రూ.29,900కే పొందవచ్చు. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ అండ్‌ డెబిట్‌ కార్డ్‌పై రూ.3000 డిస్కౌంట్‌, రూ.11,950 వరకు ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ పొందవచ్చు.

ఐక్యూఓఓతో పాటు ఇంకా
ఐక్యూఓఓతో పాటు అదనంగా రెడ్‌మీ 9సిరీస్‌, రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌లోని రెడ్‌మీ నోట్‌ 10టీ, నోట్‌ 10ప్రో, రెడ్‌మీ నోట్‌ 10ప్రో, రెడ్‌మీ నోట్‌ 10 ప్రో మ్యాక్స్‌, రెడ్‌మీ నోట్‌ 10ఎస్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ, శాంసంగ​ గెలాక్సీ ఎం52లపై భారీ డిస్కౌంట్‌ పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement