ఎట‍్టకేలకు నథింగ్ ఫోన్ (1) స్మార్ట్ ఫోన్ భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ఫోన్ ఎలా ఉంది. ఫోన్ ధరెంత? ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం.
దేశీయ మార్కెట్‌లో శాంసంగ్, షావోమీ, రియల్ మీ స్మార్ట్ ఫోన్‌లకు గట్టి పోటీ ఇస్తూ విడుదలైన నథింగ్ ఫోన్ (1) ధర రూ.32,999గా ఉంది. వన్ ప్లస్ కో- ఫౌండర్ కార్ల్ పీ సొంతంగా స్మార్ట్ ఫోన్ నథింగ్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ ఫోన్ వన్ ప్లస్‌కు చెందిన 'వన్ ప్లస్ నార్డ్ 2టీ' కంటే నథింగ్ ఫోన్ (1) ఫోన్ బాగుంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నథింగ్ ఫోన్ (1)ఫీచర్లు
నథింగ్ ఫోన్ (1) ఫోన్ 6.55 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 15డబ్ల్యూ క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 10-బిట్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానల్, హెచ్‌డీఆర్10 ప్లస్ సపోర్ట్, 402పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్ జెడ్ టచ్ శాంప్లింగ్ సదుపాయం ఉంది.
దీంతో పాటు ఈ ఫోన్‌లో క్వాల్కం స్నాప్ డ్రాగన్ 778జీ ప్లస్ చిప్ సెట్, 12జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ యూఎఫ్‌ఎస్ 3.1స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్ (ఓఐఎస్ ప్లస్ ఈఐఎస్),50 ఎంపీ శాంసంగ్ జేఎన్1 ఆల్ట్రా వైడ్ సెన్సార్(ఈఐఎస్)16 ఎంపీ సోని ఐఎంఎక్స్ 471 ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
వన్ ప్లస్ నార్డ్2 టీ వర్సెస్ నథింగ్ ఫోన్ (1) ధరలు
మనదేశంలో నథింగ్ ఫోన్ (1), వన్ ప్లస్ నార్డ్2 మధ్య వ్యత్యాసం ఎలా ఉందో చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ ..128జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 32,999, 8జీబీ ర్యామ్..256జీబీ ఫోన్ ధర రూ. 35,999, 12జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.38,999గా ఉంది.
ఇక వన్ ప్లస్ నార్డ్2 టీలో కేవలం రెండు వేరియంట్ స్టోరేజ్ సదుపాయం ఉంది. 8జీబీ ర్యామ్ 128జీబీ (రూ. 28,999), 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మాత్రమే ఉంది. ఈ వేరియంట్ స్టోరేజ్ ఫోన్ ధర (రూ. 33,999).గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment