Motorola Moto E32s Priced Under Rs 10,000 In Telugu - Sakshi
Sakshi News home page

Motorola Moto E32s: అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల, ధర మరీ ఇంత తక్కువా!

Published Wed, Jun 1 2022 7:20 PM | Last Updated on Wed, Jun 1 2022 9:12 PM

 Motorola Moto E32s Priced Under Rs 10,000 In Telugu - Sakshi

ఈ పెళ్లిళ్ల సీజన్‌లో స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మీరు కొనాలనుకుంటున్న ఫోన్‌లో అదిరిపోయే ఫీచర‍్లతో మీ బడ్జెట్‌లో ఉండాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ స‍్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ తక్కువ ధరకే స్మార్ట్‌ ఫోన్‌ను రేపు (జూన్‌2న) విడుదల చేయనుంది.       


మోటో ఈ32ఎస్‌ ఫీచర్లు
ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమవుతున్నా, లేదంటే విడుదలకు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు సేమ్‌ డిజైన్‌లే ఉంటాయి. కానీ ఈ మోటో ఈ32ఎస్‌ మాత్రం పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే, ఫోన్‌ వెనుక భాగంలో ట్రిపుల్‌ రేర్‌ కెమెరాను డిజైన్‌ చేసింది. స్లేట్‌ గ్రే, మిస్టీ సిల్వర్‌ కలర్స్‌లో లభ్యం కానుంది.  ఐపీ52 రేటింగ్‌ అంటే కింద పడినా, వాటర్‌లో పడినా తిరిగి వినియోగించుకోవచ్చు. యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, కింది భాగంలో ఒకే స్పీకర్, బయోమెట్రిక్  కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే
మోటో ఈఎస్‌32ఎస్‌ 5000ఏఎంహెచ్‌ బ్యాటరీ, 15డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లే, ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే లేనప్పటికీ  స్క్రీన్ 90హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఫోన్‌ పనితీరు, సామర్ధ్యం బాగుండేందుకు మీడియా టెక్‌ హీలియా జీ 37 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందిస్తుంది.

3జీబీ ర్యామ్‌ ప్లస్‌ 32జీబీ స్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌ ప్లస్‌ 64జీబీ స్టోరేజ్‌ ఉండే రెండు కాన్ఫిగరేషన్‌లను అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా, వెనుక కెమెరా సెటప్‌లో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో  ఒక 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.  

మోటో ఈ32ఎస్‌ ధర 
మోటరోలా సంస్థ మోటో ఈ32ఎస్‌ పేరుతో రూ.10వేల బడ్జెట్‌ ఫోన్‌ను జూన్‌2న విడుదలకు సిద్ధమైంది. ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ మాత్రం అదే ఫోన్‌  3జీబీ ర్యామ్‌ ప్లస్‌ 32జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ను రూ.9,222గా ఉందని తెలిపింది. ఇక 4జీబీ ప్లస్‌ 64జీబీ ర్యామ్‌ ఫోన్‌ ధర ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement