ఢిల్లీ : కొత్త ఏడాది 2025 సందర్భంగా ఆన్‌లైన్ అమ్మకాలు సరికొత్త రికార్డ్‌లు నమోదు చేశాయి. డిసెంబర్ 31 రోజున ద్రాక్ష నుంచి కండోమ్స్ వరకు.. చిప్స్ ప్యాకెట్ల నుండి హ్యాండ్‌కఫ్‌ల వరకు కస్టమర్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టారని ఫాస్ట్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్‌తో పాటు ఫాస్ట్ డెలివరీ స్టార్టప్‌లు ఆన్‌లైన్ అమ్మకాల రిపోర్ట్‌ను విడుదల చేశాయి.
తమ డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌లు మంగళవారం సాయంత్రం 8 గంటల వరకు చిప్స్, కోక్, నామ్‌కీన్‌లను కస్టమర్లకు డెలివరీ చేసినట్లు బ్లింకిట్ సహ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాత్రి 8 గంటల వరకు 2.3 లక్షల ప్యాకెట్ల ఆలూ భుజియా, 6,834 ఐస్ క్యూబ్‌ల ప్యాకెట్లను కస్టమర్లకు అందించినట్లు వెల్లడించారు. 39 శాతం చాక్లెట్ ఫ్లేవర్ కండోమ్ విక్రయించగా.. స్ట్రాబెర్రీ 31 శాతం, బబుల్‌గమ్ 19 శాతం అమ్మకాలు జరిగినట్లు తెలిపారు.
1,22,356 packs of condoms
45,531 bottles of mineral water
22,322 Partysmart
2,434 Eno
..are enroute right now! Prep for after party? 😅— Albinder Dhindsa (@albinder) December 31, 2024
నిన్న కస్టమర్లు ద్రాక్ష పండ్లను ఎక్కువ మొత్తంలో ఆర్డర్ పెట్టడంపై దిండా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఈరోజు ద్రాక్ష పండుకు ఇంత క్రేజ్ ఏంటి? ఉదయం నుండి ప్లాట్‌ఫారమ్‌లో అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువులలో ఇదొకటి!’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అదే సమయంలో మంగళవారం సాయంత్రం 7:30ల వరకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నిమిషానికి 853 చిప్స్ ప్యాకెట్‌లను, బ్లైండ్‌ఫోల్డ్స్, హ్యాండ్‌కఫ్‌లను డెలివరీ చేసింది. 7:41కి ఐస్ క్యూబ్స్ ఊహించని స్థాయిలో ఆర్డర్‌లు వచ్చాయని, కేవలం నిమిషం వ్యవధిలో 119 కిలోలు ఐస్ క్యూబ్స్‌ను డెలివరీ చేసినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కోఫౌండర్ ఫణి కిషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బిగ్‌బాస్కెట్‌లో కూల్‌డ్రింగ్స్ ఆర్డర్‌లు 552 శాతానికి చేరుకున్నాయి. డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్ల అమ్మకాలు 325 శాతం, పచ్చిక కార్పెట్, మాక్ టెయిల్ విక్రయాలు 200 శాతం పెరిగాయి.
https://t.co/ookPgwMqg3 pic.twitter.com/oUViC73eGS
— Albinder Dhindsa (@albinder) December 31, 2024
న్యూఇయర్‌లో జరిగిన ఆన్‌లైన్ అమ్మకాలతో కోవిడ్-19 రాకతో వినియోగదారుల అభిరుచి మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా క్విక్ కామర్స్ సంస్థల రాకతో సంప్రదాయ ఆఫ్‌లైన్ షాపుల్లో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టింది. నిమిషాల్లో డెలివరీతో బిజినెస్ స్ట్రాటజీ మెట్రో నగరాలను దాటి టైర్-2, టైర్-3 నగరాలకు పాకింది. ఫలితంగా వినియోగదారులు ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లో కావాల్సిన వస్తువుల్ని ఆర్డర్ పెట్టుకుంటున్నట్లు తాజాగా, క్విక్ కామర్స్ డెలివరీ రిపోర్ట్‌లతో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment