ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎమోషనల్ అయ్యారు. జెఫ్‌బెజోస్ 1994లో అమెరికాలోని న్యూయార్క్ నగరం సియాటెల్‌కు చెందిన ఓ గ్యారేజీలో అమెజాన్ సంస్థను ప్రారంభించారు. ‘ఇంతై.. ఇంతింతై.. వటుడింతై’ అన్నట్లుగా ఆ సంస్థ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరిగా బెజోస్‌ను నిలబెట్టింది. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ఫ్లోరిడా మయామికి వెళ్లిపోతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అమెజాన్.కామ్ ఆఫీస్ మొత్తం చూసేందుకు మీకు ఎక్కువ సమయం పట్టదు అంటూ సియోటెల్ గ్యారేజీలో అమెజాన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో తీసుకున్న వీడియోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఆప్పట్లో అమెజాన్‌ను స్థాపించిన సమయంలో తన ఆఫీస్ ఎలా ఉందో చూడండి అంటూ బెజోస్ తన ఆఫీస్‌ను చూపిస్తుండగా.. ఆ వీడియో తీస్తున్న బెజోస్ తండ్రి ఉత్సాహపరుస్తున్నట్లు వాళ్లిద్దరి మధ్య జరుగుతున్న సంభాణల్ని మనం వినొచ్చు.
అయితే బెజోస్ హైస్కూల్ విద్యార్ధిగా ఉన్న సమయంలో నివసించిన మయామి ప్రాంతానికి తన తల్లిదండ్రుల కోసమే సియోటెల్‌ని వదిలి వెళ్లిపోతున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజన్ కార్యకలాపాలు ఎక్కువగా ఫ్లోరిడా కేప్ కెనావెరల్ నుంచి కొనసాగుతున్నాయి. ఆ స్పేస్ పనులు దగ్గరుండి చూసుకునేందుకు వీలు కలుగుతున్నట్లు వెల్లడించారు.
బిలియనీర్ బంకర్‌లోని జెఫ్ బెజోస్ ఇంటి ప్రత్యేకతలు
ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న జెఫ్‌బెజోస్ ఫ్లోరిడాలోని బిలియనీర్ బంకర్ ద్వీపంలో తన 68 మిలియన్ల విలువైన ఎస్టేట్‌కు పక్కనే ఉన్న భవనాన్ని 79 మిలియన్లు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు తర్వాత సియోటెల్ నుంచి ఫ్లోరిడాకు వెళుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
2000లో నిర్మించిన 19,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఖరీదైన ఇల్లు, ఏడు బెడ్‌రూమ్‌లు, 14 బాత్‌రూమ్‌లు, ఒక కొలను, థియేటర్, లైబ్రరీ, ఒక వైన్ సెల్లార్,మెయిడ్స్ క్వార్టర్స్ మరియు ఆరు గ్యారేజ్ స్థలాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో బిలియనీర్ బంకర్ ద్వీపంలో మరో ప్రాంతంలో కొనుగోలు చేసిన 9,259 చదరపు అడుగుల మాన్స్‌లో కేవలం మూడు బెడ్‌రూమ్‌లు, మూడు బాత్‌రూమ్‌లు ఉన్నాయి.
చదవండి👉 చంద్రుడి మీదకు మనుషులు.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు జాక్ పాట్!
Comments
Please login to add a commentAdd a comment