ఈ రంగాల వారికి భారీగా వేతనపెంపు
ఈ రంగాల వారికి భారీగా వేతనపెంపు
Published Fri, Apr 14 2017 8:29 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM
ముంబై : బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగాల్లో పనిచేస్తున్నారా? అయితే మీకు ఏడాది శుభకాలమేనట. గత రెండేళ్లుగా పోలిస్తే ఈ ఏడాది ఈ రంగాల్లో వేతనాలు భారీగా పెంపు ఉంటుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. టీమ్-లీజ్ జాబ్స్, శాలరీస్ ప్రీమియర్-2017 అధ్యయన రిపోర్టు ఈ విషయాన్ని రివీల్ చేసింది.
గత నాలుగేళ్లుగా వేతనాల ఇంక్రిమెంట్లో టాప్ లో మోనోపలి సాగిస్తున్న ఐటీ రంగం తర్వాత ఈ ఏడాది బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ రంగానికే ఎక్కువ వేతన ఇంక్రిమెంట్ ఉండబోతున్నట్టు పేర్కొంది. ఎన్నడూ లేనంతగా సగటున 11.2 శాతం వేతన ఇంక్రిమెంట్లు ఉంటాయని తెలిపింది. విద్యా, ఈ-కామర్స్ రంగాల్లో 100కిపైగా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని వెల్లడించింది.
అదేవిధంగా నిర్మాణం, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, పారిశ్రామిక తయారీ, దాని అనుబంధ పరిశ్రమల్లో ఇంక్రిమెంట్లు తగ్గిపోనున్నాయట. ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఈ రంగాలను భారీగా దెబ్బకొట్టిందని తాజా రిపోర్టు వెల్లడించింది. ఇతర రంగాలు ఎఫ్ఎమ్సీజీ, రిటైల్ ర్యాలీ నిర్వహిస్తాయని పేర్కొంది. తక్కువ సప్లై, ఎక్కువ డిమాండ్ కారణంగా బ్లూ-కాలర్ జాబ్స్ కు కొన్నేళ్లుగా డిమాండ్ భారీగానే ఉంటుందట. శారీరక శక్తి, వ్యాయామం, బేసిక్ రీడింగ్, రాత, మౌఖిక కమ్యూనికేషన్, వ్యక్తిగత నేర్పు వంటి స్కిల్స్ ఉన్న వారికి డిమాండ్ ఉన్నట్టు రిపోర్టు తెలిపింది.
ఈ సందర్భంగానే శాశ్వత, తాత్కాలిక ఉద్యోగాల మధ్య ఏమేర తేడా ఉంటుందో కూడా వెల్లడించింది. ఆరు నగరాల్లో ఏడు రంగాలపై జరిపిన సర్వేలో తాత్కాలిక, శాశ్వత ఉద్యోగాల మధ్య తేడా స్వల్పంగానే ఉన్నట్టు తేల్చింది. ఈ విషయంలో చండీఘర్(0.92శాతం-2.85శాతం), కోల్ కత్తా(1% - 3.14%), అహ్మదాబాద్(1.08% - 2.73%)లు టాప్ ఉన్నట్టు పేర్కొంది. రంగాల్లో ఐటీ, తయారీ, టెలికమ్యూనికేషన్లు, బీఎఫ్ఎస్ఐలు టాప్ లో ఉన్నాయట.
Advertisement
Advertisement