సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత అత్యధిక మొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, పన్ను రిటర్నులు దాఖలు చేయని వారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేస్తోంది. తాజాగా పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ.25 లక్షల కంటే ఎక్కువగా మొత్తంలో డిపాజిట్ చేసి, గడువు నాటికి పన్ను రిటర్నులు దాఖలు చేయని 1.16 లక్షల మంది వ్యక్తులకు, సంస్థలకు ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసులు పంపింది. ఈ విషయాన్ని సీబీడీటీ చైర్మన్ సుశిల్ చంద్ర తెలిపారు. అంతేకాక ఐటీ రిటర్నులు దాఖలు చేసి, పెద్ద మొత్తంలో డిపాజిట్‌లు చేసిన వారిపై కూడా ఐటీ శాఖ దృష్టిపెట్టింది.
ఐటీ రిటర్నులు దాఖలు చేయని సంస్థలను, వ్యక్తులను రెండు కేటగిరీలుగా విభజించింది. వీరిలో 1.16 లక్షల మంది పాత కరెన్సీ నోట్లలో రూ.25 లక్షలకు పైగా మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు తెలిసింది. కానీ వీరు ఐటీ రిటర్నులు దాఖలు చేయలేదని, 30 రోజుల వ్యవధిలో వీరిని ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని ఆదేశించినట్టు సుశిల్ చంద్ర తెలిపారు. రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్యలో 2.4 లక్షల మంది డిపాజిట్ చేశారని, కానీ వీరు కూడా రిటర్నులు దాఖలు చేయలేదని పేర్కొన్నారు. వీరికీ రెండో దశలో నోటీసులు పంపనున్నట్టు చెప్పారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 142(1) కింద నోటీసులు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment