నోట్ల రద్దు : రూ.246 కోట్ల డిపాజిట్
- బినామీ అకౌంట్లలో భారీగా డిపాజిట్లు
- తమిళనాడు రాజకీయనేతవిగా అనుమానాలు
- విస్తృతంగా శోధిస్తున్న ఐటీ శాఖ
చెన్నై: పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీగా నల్లధనాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసిన ఘటన తాజాగా తమిళనాడులో వెలుగు చూసింది. తమిళనాడులో నల్లధనం గుట్టు విప్పే పనిలో సీరియస్‌గా పనిచేస్తున్న ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్.. పెద్దనోట్ల రద్దు సమయంలో 246 కోట్ల రూపాయల డిపాజిట్లను గుర్తించింది. ఈ డబ్బు తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడివిగా ఐటీ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
సింగిల్ అకౌంట్.. సింగిల్ ట్రాన్సాక్షన్
246 కోట్ల రూపాయలను ఒకేసారి డిపాజిట్ అదికూడా బ్యాంకింగ్ అవర్స్‌లోనూ డిపాజిట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. డిమానిటైజేషన్ సమయంలో డిపాజిట్ అయిన అతి పెద్ద మొత్తం కూడా ఇదేనని ఇటీ అధికారులు అంటున్నారు.
441 అకౌంట్లలో..
తమిళనాడులోని పలు బ్యాంకుల్లో సుమారు 441 అకౌంట్లలో కోట్ల రూపాయల డిపాజిట్లు జరిగాయని ఐటీ శాఖ చెబుతోంది. దురదృష్టం ఏమిటంటే.. ఆయా ఖాతాదారుల వివరాలు కూడా బ్యాంకుల్లో లేవని.. ఇవన్నీ బినామీ, అక్రమ ఖాతాలని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. వివరాలు లేని ఖాతాల్లో పెద్దపెద్ద మొత్తాలు డిమానిటైజేషన్ సమయంలో డిపాజిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు.
27,739 మందికి నోటీసులు
డిమానిటైజేషన్ సమయంలో అనుమానాస్పదంగా భారీ స్థాయిలో మొత్తాలను డిపాజిట్ చేసిన 27,739 మంది ఖాతాదారులను గుర్తించి వారికి నోటీసులు పంపినట్లు ఐటీ అధికారులు చెప్పారు.