ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకలు, అట్టముక్కలు రావడం సర్వ సాధారణమయ్యాయి. తాజాగా ఓ మహిళ తనకెంతో ఇష్టమైన ఐఫోన్ బుక్ చేసింది. అయితే ఐఫోన్ బుక్ చేసిన ఆమెకు అనూహ్యంగా శానిటైజర్ డబ్బా డెలివరీ అయ్యింది. దీంతో కంగుతిన్న బాధితురాలు లక్షన్నర ఫోన్ ఆర్డర్ ఇస్తే శానిటైజర్ డబ్బా వచ్చింది! ఏం చేసుకోను అంటూ ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
లండన్ కు చెందిన 32 ఏళ్ల ఖవ్లా లఫాహిల్ గతేడాది యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 13 మ్యాక్స్‌ప్రో ను బుక్ చేసింది. యూకేలో ఆ ఫోన్ ధర 2,031 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం(సుమారు రూ.1,51,713.67) బుక్ చేసిన కొన్నిరోజల తర్వాత తన ఇంటికి వచ్చిన ఐఫోన్ పార్శిల్ ఓపెన్ చేసి చూడగా అందులో శానిటైజర్ ఉండడంతో అవాక్కు అవ్వడం ఆమె వంతైంది.
అంతే ఐఫోన్కు బదులు శానిటైజర్ రావడంతో ఆగ్రహానికి గురైంది.మీ కంపెనీ సర్వీస్ చెత్తగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగివచ్చిన యాజమాన్యం బాధితురాలికి క్షమాపణలు చెప్పింది. త్వరలోనే ఐఫోన్ 13 మ్యాక్స్ ప్రోను అందిస్తామని సదరు డెలివరీ సంస్థ నిర్వాహకులు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment