ప్రముఖ దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యవసర వస్తువుల డెలివరీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ తరుణంలో మంగళవారం (అక్టోబర్10)న ఫ్లిప్‌కార్ట్ పోర్టల్‌కు యూజర్లు పోటెత్తారు. దీంతో ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆ సైట్‌లో నిత్యవసర వస్తువుల్ని బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన యూజర్లకు ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ సెగ్మెంట్‌లో చిన్న బ్యానర్‌ను డిస్‌ప్లే కనిపించింది. రేపటి నుంచి సరుకుల్ని బుక్ చేసుకోండనేది ఆ బ్యానర్ సారాంశం.
ఫిర్యాదుల వెల్లువ
అసలే పండగ సీజన్, పైగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంది. ఈ సమయంలో గ్రోసరీ షాపింగ్ చేసే సమయంలో సమస్య తలెత్తుతుందంటూ కొనుగోలు దారులు ఫ్లిప్ కార్ట్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు.
సేవలు పున:ప్రారంభం అప్పుడే
బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభమైన మొదటి రెండు రోజులు ఊహించని విధంగా ఆర్డర్‌లు వచ్చాయి. అన్నీ కేటగిరీల్లో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని అందించడమే మా లక్క్ష్యం. అయితే, కొత్త ఆర్డర్‌లను అక్టోబర్ 11 మిడ్ నైట్ 12 గంటల నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.
రూ.90వేల కోట్ల ఆన్‌లైన్ అమ్మకాలు
పండగ సీజన్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లు ఆన్ లైన్ విక్రయాలు ఎంత మేర జరిగే అవకాశం ఉందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ ఓ నివేదికను విడుదల చేసింది. ‘రెడ్‌సీర్ సస్టట్రాటజీ కన్సల్టెంట్స్’ రిపోర్ట్ ప్రకారం.. ఆన్‌లైన్ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 నుంచి 20 శాతం మేర పెరిగి రూ.90 వేల కోట్లు జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. గత ఏడాది రూ.76,000 కోట్ల ఆన్‌లైన్ విక్రయాలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment