Big Billion Day sale
-
పోటెత్తుతున్న యూజర్లు.. ఆ సేవల్ని రద్దు చేసిన ‘ఫ్లిప్ కార్ట్’!
ప్రముఖ దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యవసర వస్తువుల డెలివరీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ తరుణంలో మంగళవారం (అక్టోబర్10)న ఫ్లిప్‌కార్ట్ పోర్టల్‌కు యూజర్లు పోటెత్తారు. దీంతో ఫ్లిప్‌కార్ట్ సైట్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ సైట్లో నిత్యవసర వస్తువుల్ని బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన యూజర్లకు ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ సెగ్మెంట్లో చిన్న బ్యానర్‌ను డిస్ప్లే కనిపించింది. రేపటి నుంచి సరుకుల్ని బుక్ చేసుకోండనేది ఆ బ్యానర్ సారాంశం. ఫిర్యాదుల వెల్లువ అసలే పండగ సీజన్, పైగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంది. ఈ సమయంలో గ్రోసరీ షాపింగ్ చేసే సమయంలో సమస్య తలెత్తుతుందంటూ కొనుగోలు దారులు ఫ్లిప్ కార్ట్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. సేవలు పున:ప్రారంభం అప్పుడే బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభమైన మొదటి రెండు రోజులు ఊహించని విధంగా ఆర్డర్లు వచ్చాయి. అన్నీ కేటగిరీల్లో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని అందించడమే మా లక్క్ష్యం. అయితే, కొత్త ఆర్డర్లను అక్టోబర్ 11 మిడ్ నైట్ 12 గంటల నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. రూ.90వేల కోట్ల ఆన్లైన్ అమ్మకాలు పండగ సీజన్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్లు ఆన్ లైన్ విక్రయాలు ఎంత మేర జరిగే అవకాశం ఉందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ ఓ నివేదికను విడుదల చేసింది. ‘రెడ్‌సీర్ సస్టట్రాటజీ కన్సల్టెంట్స్’ రిపోర్ట్ ప్రకారం.. ఆన్లైన్ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 నుంచి 20 శాతం మేర పెరిగి రూ.90 వేల కోట్లు జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. గత ఏడాది రూ.76,000 కోట్ల ఆన్లైన్ విక్రయాలు జరిగాయి. -
అదిరిపోయే ఆఫర్, రూ.60 వేల భారీ డిస్కౌంట్‌తో బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్
మనేదేశంలో ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ దుమ్మురేపుతున్నాయి. ఆన్లైన్ వేదికగా జరిగే ఈ అమ్మకాల్లో తమకు నచ్చిన ప్రాడక్ట్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు వినియోగదారులు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయారు. అయితే కొనుగోలు దారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆ రెండు ఈ కామర్స్ కంపెనీలు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లను రూ.10,000 లోపే అందిస్తున్నాయి. ఇప్పుడు హై కాన్ఫిగర్ బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్‌లను తక్కువ ధరకే అమ్మేందుకు అమెజాన్ సిద్ధమైంది.ప్రముఖ గేమింగ్ ల్యాప్‌ట్యాప్ 'ఆసుస్ డాష్ ఎఫ్15' ధర రూ. 1,39,900 మార్కెట్లో విడుదలైంది.ఈ థమకా సేల్‌లో ల్యాప్ ట్యాప్‌ను రూ.60వేల డిస్కౌంట్‌తో రూ.79,990కే సొంతం చేసుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది. అంతేకాదు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ల్యాప్ ట్యాప్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఐ5 11 జనరేషన్ వేరియంట్ ల్యాప్ ధర రూ.69,990కే సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. ఆసుస్ టీయూఎఫ్ డాష్ ఎఫ్15 స్పెసిఫికేషన్లు ♦ 15.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే 144హెచ్‌జెడ్ హై రిఫ్రెష్ రేట్ ♦ 11 జనరేషన్, కోర్ ఐ7చిప్ సెట్ ♦ 16 జీబీ డీడీఆర్4 ర్యామ్ 512జీబీ ఎన్వీఎంఈ పీసీఐఆ 3.0 ఎస్ఎస్డీ ♦ బ్లూటూత్ వీ5.2 అండ్ వైఫై 6 కనెక్టివిటీ ♦ త్రీ యూఎస్బీ టైప్ ఏ (3.2జనరేషన్1) పోర్ట్ ♦ థండర్ బోల్ట్ 4 పోర్ట్, హెచ్డీఎంఐ 2.0 పోర్ట్ ♦ ఆర్జే 45 అండ్ 3.5ఎం ఎం హెడ్ ఫోన్ జాక్ చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
3రోజుల్లో.. 70 మంది కోటీశ్వరులయ్యారు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించిన బిగ్ బిలయన్ డే సేల్‌లో భారీగా ఆర్డర్లు నమోదయ్యాయి. దసరా, దీపావళి పండుగలకు ముందు భారీ ఆఫర్లు, తగ్గింపు ధరలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక అమ్మకాల కార్యక్రమాలను ఈనెల 16 నుంచి చేపట్టిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు ‘బిగ్ బిలియన్ డే సేల్’ పేరుతో అమ్మక కార్యక్రమం చేపట్టింది. అయితే ఇది మొదలైన మూడు రోజుల్లోనే 70 మంది అమ్మకందారులు కోటీశ్వరులైనట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలానే మరో 10 వేల మంది అమ్మకందారులు లక్షాధికారులు అయినట్లు వెల్లడించింది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం బిగ్‌బిలియన్ డే సేల్ మూడు రోజుల్లో ప్లాట్‌ఫామ్‌లోని అమ్మకందారులకు మంచి బిజినెస్ లభించింది. ఇక మొదటి మూడు రోజుల్లో తన వేదికపై 3 లక్షలకు పైగా విక్రేతలకు ఆర్డర్లు లభించినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ఆర్డర్లలో 60 శాతం టైర్–2 (ద్వితీయ శ్రేణి), అంతకంటే చిన్న పట్టణాలవే ఉన్నట్టు పేర్కొంది. (చదవండి: 12 గంటల్లో 1.75 లక్షల ఫోన్ల అమ్మకం) ''ఈ ఏడాది విక్రయదారుల సంఖ్య 20శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా 3,000కు పైగా పిన్కోడ్లకు సేవలు అందిస్తున్నాము. 2020 బిగ్ బిలియన్‌డేస్ తొలి రెండు రోజుల్లో విక్రేతలు.. 2019 బిగ్‌బిలియన్ డేస్ కార్యక్రమంలో ఏడు రోజుల విక్రయాలను మించి వృద్ధిని చూశారు’’ అని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. తొలి 3 రోజుల్లో ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్ పేలేటర్ ద్వారా కస్టమర్లు చేసిన ఖర్చు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ఏడాది అత్యవసరమైన ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఏర్పడిందని.. ముఖ్యంగా గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించి ఎక్కువ ఆర్డర్లు లభించాయని తెలిపింది. అలానే సాధారణ రోజుల్లో పోల్చితే పండగ సీజన్లో డిజిటల్ చెల్లింపులు లావాదేవీలు 60 శాతం పెరిగాయన్నది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఎక్కువ మంది ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపారు. దాంతో అమ్మకాలు భారీగా జరిగాయి. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వేదికలపై భారీగా అమ్మకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వేదికలపై తొలి రెండు రోజుల్లో భారీగా ఆర్డర్లు నమోదయ్యాయి. ముఖ్యంగా ద్వితీయశ్రేణి, ఆ తర్వాత పట్టణాలకు చెందిన విక్రేతలు పెద్ద ఎత్తున ఆర్డర్లు అందుకున్నట్టు ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. దసరా, దీపావళి పండుగలకు ముందు భారీ ఆఫర్లు, తగ్గింపు ధరలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక అమ్మకాల కార్యక్రమాలను ఈనెల 16 నుంచి చేపట్టిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ అయితే ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు ‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో అమ్మక కార్యక్రమం చేపట్టగా.. అమెజాన్ ఈ నెల 17 నుంచి 23 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. గ్రేట్ ఇండియా ఫెస్టివల్ మొదటి 48 గంటల్లో తన ప్లాట్‌ఫామ్‌పై 1.1 లక్షల విక్రేతలు ఆర్డర్లు అందుకున్నట్టు అమెజాన్ ఇండియా ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఆర్డర్లలో అధిక శాతం చిన్న పట్టణాలకు చెందిన విక్రేతలకే వెళ్లినట్టు తెలిపింది. అదే విధంగా మొదటి మూడు రోజుల్లో తన వేదికపై 3 లక్షలకు పైగా విక్రేతలకు ఆర్డర్లు లభించినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ఆర్డర్లలో 60 శాతం టైర్–2 (ద్వితీయ శ్రేణి), అంతకంటే చిన్న పట్టణాలవే ఉన్నట్టు పేర్కొంది. అయితే, ఆర్డర్ల పరిమాణాన్ని ఈ సంస్థలు ప్రకటించలేదు. విక్రయాల కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రకటిస్తాయేమో చూడాల్సి ఉంది. ఏడేళ్లలోనే అధికం ‘‘తొలి 48 గంటల్లో నమోదైన అమ్మకాలు అమెజాన్‌కు ఏడేళ్ల కాలంలోనే అత్యధికం. అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫామ్‌పై 6.5 లక్షల విక్రయదారులు నమోదై ఉంటే, 1.1 లక్షల విక్రేతలకు ఆర్డర్లు అందాయి. కొత్త కస్టమర్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. 91 శాతం మంది చిన్న పట్టణాల నుంచే ఆర్డర్లు చేశారు. కొత్తగా చేరిన ప్రైమ్ సభ్యుల్లోనూ 66 శాతం చిన్న పట్టణాల నుంచే ఉన్నారు’’ అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ తెలిపారు. లక్షకు పైగా కస్టమర్లు అమెజాన్ సొంత ఉత్పత్తులైన ఎకో, ఫైర్ టీవీలను కొనుగోలు చేసినట్టు చెప్పారు. గృహాలంకరణ, వస్త్రాల విక్రయాల్లో పెరుగుదల ఉన్నట్టు తెలిపారు. రెండు రోజుల్లోనే.. ‘‘ఈ ఏడాది విక్రయదారుల సంఖ్య 20% పెరిగింది. దేశవ్యాప్తంగా 3,000కు పైగా పిన్కోడ్లకు సేవలు అందిస్తున్నాము. 2020 బిగ్ బిలియన్‌డేస్ తొలి రెండు రోజుల్లో విక్రేతలు.. 2019 బిగ్‌బిలియన్ డేస్ కార్యక్రమంలో ఏడు రోజుల విక్ర యాలను మించి వృద్ధిని చూశారు’’ అని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. తొలి 3 రోజుల్లో ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్ పేలేటర్ ద్వారా కస్టమర్లు చేసిన ఖర్చు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. -
ఫ్లిప్‌కార్ట్ సేల్ : టీవీలపై భారీ డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్లో భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను అలరించడానికి ఈ-కామర్స్ దిగ్గజాలు వచ్చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో మెగా సేల్ ఈవెంట్లను నిర్వహించబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 20 నుంచి 24 వరకు తన బిగ్ బిలియన్ డేస్ సేల్కు శ్రీకారం చుట్టబోతుంది. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లపై 70 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. దీనిలో 32 అంగుళాల టీవీలు, స్మార్ట్ టీవీలుంటాయని, అంతేకాక ఆల్ట్రా హెచ్డీ 4కే టీవీలపై 40 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ చెప్పింది. బిగ్ స్క్రీన్ టీవీలపై అయితే ఏకంగా రూ.70వేల వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఫ్యాషన్, లైప్స్టయిల్లో ఇంతకముందు ఎన్నడూ చూడని 500 ప్లస్ బ్రాండులను కంపెనీ ప్రవేశపెట్టబోతుంది. గాడ్జెట్లు, అప్లియెన్స్ వంటి అన్ని రకాల ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్లతో మారుమోగించబోతుంది. ఇప్పటికే ఆసుస్, మోటోరోలా, హెచ్‌టీసీ బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై రాయితీలతో పాటు, శాంసంగ్ గెలాక్సీ ఎస్7, రెడ్మి 4ఏ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోయే ఈ సేల్కు పోటీగా అమెజాన్ ఇండియా, పేటీఎం మాల్‌లు కూడా మెగా సేల్ ఈవెంట్లకు తెరలేపబోతున్నాయి.