ఫ్లిప్‌కార్ట్ సేల్ : టీవీలపై భారీ డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ సేల్ : టీవీలపై భారీ డిస్కౌంట్
Published Mon, Sep 18 2017 11:43 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్‌లో భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను అలరించడానికి ఈ-కామర్స్ దిగ్గజాలు వచ్చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో మెగా సేల్ ఈవెంట్లను నిర్వహించబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 20 నుంచి 24 వరకు తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు శ్రీకారం చుట్టబోతుంది. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లపై 70 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. దీనిలో 32 అంగుళాల టీవీలు, స్మార్ట్ టీవీలుంటాయని, అంతేకాక ఆల్ట్రా హెచ్‌డీ 4కే టీవీలపై 40 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ చెప్పింది. బిగ్ స్క్రీన్ టీవీలపై అయితే ఏకంగా రూ.70వేల వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకొస్తుంది.
ఫ్యాషన్, లైప్‌స్టయిల్‌లో ఇంతకముందు ఎన్నడూ చూడని 500 ప్లస్ బ్రాండులను కంపెనీ ప్రవేశపెట్టబోతుంది. గాడ్జెట్లు, అప్లియెన్స్ వంటి అన్ని రకాల ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్లతో మారుమోగించబోతుంది. ఇప్పటికే ఆసుస్, మోటోరోలా, హెచ్‌టీసీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై రాయితీలతో పాటు, శాంసంగ్ గెలాక్సీ ఎస్7, రెడ్‌మి 4ఏ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోయే ఈ సేల్‌కు పోటీగా అమెజాన్ ఇండియా, పేటీఎం మాల్‌లు కూడా మెగా సేల్ ఈవెంట్లకు తెరలేపబోతున్నాయి.
Advertisement
Advertisement