big screen TVs
-
బిగ్ స్క్రీన్ టీవీలకు బిగ్ డిమాండ్.. రూ.లక్షలు పెట్టి కొనేస్తున్నారు!
ఇల్లు చూడు.. ఇంటి అందం చూడు అనేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంతా టీవీ చూడు.. టీవీలో కనబడే పెద్ద బొమ్మ చూడు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీలు కొనేవారితో పోల్చితే ఇండియాలో పెద్ద స్కీన్ టీవీలు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోందట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు చిన్న స్క్రీన్ టీవీలు కొనాలని అడిగే వారే లేరంటోంది ఓ రీసెర్చ్ సంస్ధ. ఇంతకీ ఇంతలా పెద్ద స్క్రీన్ టీవీలు ఎందుకు కొంటున్నారు? బిగ్ స్క్రీన్స్‌కు బిగ్ డిమాండ్ కార్ల కంటే కూడా ఇండియన్స్ బిగ్ స్క్రీన్ టీవీలను కొనుగోలు చేసేందుకు తెగ ఉత్సాహపడుతున్నారని ఒక సర్వే తేల్చింది. కొంత మంది చిన్న కార్ల ధరలో టీవీలు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారట. సాధారణంగా 3, 4 లక్షల నుంచి 75 లక్షలు ధరల కలిగిన టీవీ మార్కెట్ విపరీతంగా పెరుగుతోందట. ఒటీటీలు వచ్చిన తరువాత చాలా మంది ఇండ్లలోనే హోమ్థియేటర్స్ ఏర్పాటు చేసుకుని చూడటానికి ఇష్టపడటమే ఇందుకు కారణంగా కనపడుతోంది. కరోనా సమయంలో చాలా మంది ఇంటికే పరిమితమవడం ఎంటర్టైన్మెంట్ కోసం పెద్ద టీవీలను కొనుగోలు చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు అదే కంటిన్యూ అవుతోంది. 65 ఇంచుల టీవీలను ఎగబడి కొంటున్నారు.. జిఎఫ్‌కె మార్కెట్ రీసెర్చ్ ప్రకారం 65 ఇంచుల టీవీలు కొనుగోలు చేయడానికి జనాలు తెగ ఉత్సాహం చూపుతున్నారట దీంతో ఈ మార్కెట్ 37శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక రోజు రోజుకు చిన్నటీవీల మార్కెట్ తగ్గుతూవస్తోంది. ఈ టీవీలను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపేవారే కరువయ్యారట. ఈ ఏడాది మొదటి 5 నెలల్లో ఓవరాల్‌గా టీవీ మార్కెట్ 13 శాతం వృద్ధి సాధించింది. ఇందులో బిగ్ స్క్రీన్ మార్కెట్ వాటా 17శాతం దాకా ఉంది. కోవిడ్ కంటే ముందు ఈ వాటా కేవలం 5శాతానికి మాత్రమే పరిమితమైంది. Additional Big TV Screen pic.twitter.com/RrLJdJoyPx — rajinder kumar (@rajinder75kumar) July 7, 2023 రూ. 75 లక్షల టీవీ అమ్మకాలకు ఫుల్ క్రేజ్ ఇక వినియోగదారుల ఇష్టానికి అనుగుణంగా బ్రాండెడ్ టీవీ కంపెనీలు సైతం పెద్ద పెద్ద స్కీన్స్ ఇండియాలో లాంచ్ చేసేందుకు తెగ ఆరాటపడుతున్నాయి. ఎల్జీ కంపెనీ ఇప్పటికే భారీ తెర కలిగిన ఓఎల్ఈడీ టీవీని లాంచ్ చేసింది. ఇండియాలో ఈ టీవీనే అత్యంత ఖరీదైన టీవీ . ఈ టెలివిజన్ ధర 75 లక్షలుగా ఉంది. దీన్ని ఎలా అంటే అలా చుట్టేయవచ్చు. అంతేకాదు దేశంలోని టాప్ టీవీల అమ్మకం కంపెనీ సైతం నెలకు 20 యూనిట్లు 20 లక్షల ధర కలిగిన టీవీల అమ్మకాలు చేపడుతుండగా, 10 లక్షలకు పైగా ధర ఉన్న టీవీలను నెలకు 100 దాకా అమ్ముతోంది. ఈ దీపావళికి ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించుకుంది. టెలివిజన్ తయారీ రంగంలో కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో ప్రజలు కూడా వారి వారి లగ్జరీ లైఫ్ కు అనుగుణంగా ఇంట్లో ఉండే టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్లెక్సీ ఈఎమ్ఐల రూపంలో కంపెనీలు టీవీల అమ్మకాలు చేయడం కూడా వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడానికి కారణంగా కనపడుతోంది. కేవలం బ్రాండెడ్ టీవీలే కాకుండా దేశీ బ్రాండ్ టీవీలు సైతం లోకల్ మార్కెట్లో అందుబాటులోకి రావడంతో చాలా మంది తక్కువ ధరకే పెద్దస్క్రీన్ టీవీలను కొనుగోలు చేస్తున్నారని జిఎఫ్‌కె రీసెర్చ్ తెలిపింది. బిగ్ స్క్రీన్ టీవీల మార్కెట్ విలువ 32 బిలియన్ డాలర్లు ఇండియాలో స్మార్ట్ టీవీ మార్కెట్ సైజ్ 2022లో 9.88 బిలియన్ డాలర్లు కాగా 2023 చివరి నాటికి అది 11.7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. 2023-2030 నాటికి ఇండియా టీవీ మార్కెట్ 16.7 శాతం వృద్ధితో 32.57 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందనేది నిపుణులు చెపుతున్నమాట. భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ కింద టీవీ తయారీ కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలిస్తే తయారీ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. పైగా టీవీలలో వాడే చిప్‌లు ఇండియాలోనే తయారవుతుండటం టీవీ తయారీ కాంపోనెంట్స్ దిగుమతులు తగ్గుతుండటంతో అతిపెద్ద టీవీ స్క్రీన్స్‌కు ధర మరింతగా తగ్గే అవకాశం ఉంది. - రాజ్ కుమార్, డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్, బిజినెస్, సాక్షి టీవీ -
12 కోట్ల శాంసంగ్ టీవీ!!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా భారీ స్క్రీన్లతో ’ది వాల్’ టీవీల శ్రేణిని ప్రవేశపెట్టింది. ఇవి 146 అంగుళాలు, 219 అంగుళాలు, 292 అంగుళాల స్క్రీన్‌తో లభిస్తాయి. వీటి ధర రూ. 3.5 కోట్ల నుంచి రూ. 12 కోట్ల దాకా ఉంటుంది. విలాసవంతమైన అనుభూతి కోరుకునే వారి కోసం వీటిని రూపొందించినట్లు శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ విభాగం) పునీత్ సేఠి తెలిపారు. దేశీయంగా అత్యంత సంపన్న వర్గాలు లక్ష్యంగా ఈ టీవీలు ఆవిష్కరించినట్లు వివరించారు. 2022 నాటికి 200 యూనిట్లు విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ది వాల్ శ్రేణి టీవీలు.. తెరను బట్టి మైక్రో ఎల్ఈడీ, 6కే డెఫినిషన్, 8 కే డెఫినిషన్లలో ఉంటాయి. టీవీ చూడనప్పుడు కట్టేయాల్సిన అవసరం లేకుండా.. పెయింటింగ్‌లు, ఫొటోలు వంటివి డిస్ప్లే చేసుకోవచ్చు. -
పెద్ద టీవీలకు క్రికెట్ జోష్!
న్యూఢిల్లీ : క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు వర్షాల దెబ్బతో అభిమానులను నిరాశపరుస్తున్నా.. టీవీల అమ్మకాలకు మాత్రం బాగానే ఉపయోగపడుతున్నాయి. క్రికెట్ వరల్డ్ కప్ పుణ్యమాని పెద్ద టీవీల అమ్మకాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. క్రికెట్ అభిమానులు భారీ స్క్రీన్లపై మ్యాచ్‌లను చూసేందుకు ఆసక్తి కనపరుస్తుండటమే ఇందుకు కారణం. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే సోనీ, శామ్సంగ్, ఎల్జీ, పానాసోనిక్ తదితర కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల పెద్ద టీవీల (55 అంగుళాలు, ఆ పైన) అమ్మకాలు 100 శాతం దాకా పెరగడం దీనికి నిదర్శనం. కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరి మితం కాకుండా హుబ్లి, జబల్పూర్, రాయ్‌పూర్, రాంచీ, కొచి, నాగ్‌పూర్ వంటి చిన్న పట్టణాళ్లో కూడా ఈ ధోరణి కనిపిస్తోంది. మ్యాచ్‌లు నాకవుట్ రౌండ్స్ స్థాయికి వచ్చే సరికి పెద్ద టీవీల అమ్మకాలు మరింతగా పుంజుకోగలవని కంపెనీలు ఆశిస్తున్నాయి. ఆకర్షణీయ ఆఫర్లు, సులభతరమైన ఫైనాన్సింగ్, క్యాష్‌బ్యాక్‌లు మొదలైనవి ఇందుకు ఊతంగా ఉండగలవని భావిస్తున్నాయి. ఎన్ని యూనిట్స్ అమ్ముడైనదీ ఇథమిత్థంగా ఏ సంస్థా వెల్లడించకపోయినప్పటికీ.. విక్రయాల వృద్ధి రెట్టింపైనట్లు మాత్రం చెబుతున్నాయి. ఇంగ్లాండ్‌లో మే 30న ప్రారంభమైన ఐసీసీ వరల్డ్ కప్ జూలై 14 దాకా కొనసాగనుంది. లక్ష్యం పెంపు.. ‘ప్రపంచ కప్ ప్రారంభమైనప్పట్నుంచీ పెద్ద స్క్రీన్స్.. ముఖ్యంగా 55 అంగుళాల కన్నా పెద్దవి, 4కే టీవీల అమ్మకాలు 100 శాతం ఎగిశాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే రెట్టింపు స్థాయికి చేరాయి‘ అని సోనీ ఇండియా బ్రావియా బిజినెస్ విభాగం హెడ్ సచిన్ రాయ్ తెలిపారు. వరల్డ్ కప్‌లో భారత్ టీమ్ ముందుకెళ్లే కొద్దీ టీవీల విక్రయాలూ పెరగగలవని శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వ్యాపార విభాగం) రాజీవ్ భుటాని చెప్పారు. ‘మే నెలలో 55 అంగుళాలకు పైబడిన టీవీల (క్యూఎల్ఈడీలు సహా) అమ్మకాలు రెట్టింపయ్యాయి. 75 అంగుళాలు అంతకు మించిన టీవీల విక్రయాలు 5 రెట్లు పెరిగాయి. ఈ ప్రపంచ కప్ సీజన్లో పెద్ద స్క్రీన్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను ఇది సూచిస్తోంది‘ అని ఆయన తెలిపారు. మరోవైపు కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఇలాంటి క్రీడా సంరంభాలు అనువైన సమయంగా ఉంటాయని పానాసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్ (కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం) శరత్ నాయర్ తెలిపారు. ‘55 అంగుళాలు, అంతకు మించిన పెద్ద టీవీల విక్రయాల ఊతంతో వరల్డ్ కప్ 2019 సీజన్లో మా అమ్మకాలు 25 శాతం పెంచుకోవాలని నిర్దేశించుకున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఎల్జీ కూడా తమ ప్రీమియం టీవీల విభాగంలో ఇలాంటి ధోరణే ఉన్నట్లు తెలిపింది. ‘థింక్ ఏఐ ఫీచర్ గల స్మార్ట్ టీవీల అమ్మకాల్లో 35 శాతం వద్ధి అంచనా వేస్తున్నాం. ఓఎల్ఈడీ, నానోసెల్ టీవీల విక్రయాల్లోనైతే 200 శాతం వద్ధి అంచనాలు ఉన్నాయి‘ అని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధి తెలిపారు. రూ. 60 లక్షల దాకా రేటున్న టీవీలు.. పేరొందిన బ్రాండ్స్ పెద్ద టీవీల ధర రూ. 50,000 నుంచి రూ. 1.75 లక్షల మధ్య ఉంటున్నాయి. ఇక కొన్ని మోడల్స్ రేట్లు మరింత ఎక్కువగా కూడా ఉంటున్నాయి. ఇటీవలే శాంసంగ్ సంస్థ 8కే యూహెచ్డీ టీవీని ప్రవేశపెట్టింది. దీని ధర ఏకంగా రూ. 10.99 లక్షల నుంచి రూ. 59.99 లక్షల దాకా ఉంది. గణాంకాల ప్రకారం దేశీ టీవీ మార్కెట్లో ఏటా 1.25 కోట్ల టీవీలు అమ్ముడవుతున్నాయి. వీటిలో 15 శాతం వాటా పెద్ద టీవీలది ఉంటోంది. ఆఫర్ల జోరు.. ఈ సెగ్మెంట్లో ఆఫ్‌లైన్ స్టోర్స్ అమ్మకాల వాటానే ఎక్కువగా ఉంటున్నా, ఆన్లైన్ సేల్స్ కూడా పుంజుకుంటున్నాయని టీవీ కంపెనీలు వెల్లడించాయి. విక్రయాలను పెంచుకునేందుకు బ్రాండింగ్, ప్రమోషన్స్ కార్యకలాపాలపై కూడా సంస్థలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. ‘టోర్నమెంట్లో భారత్ ముందుకు వెళ్లే కొద్దీ.. మరింత మంది వీక్షకులు పెద్ద టీవీల వైపు మళ్లే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అందుకే మేం జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్‌తో పాటు క్యూఎల్ఈడీ టీవీలపై పదేళ్ల నో స్క్రీన్ బర్న్–ఇన్, ప్యానెల్స్‌పై రెండేళ్ల వారంటీ, 15% దాకా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇస్తున్నాం. అలాగే ప్రీమియం క్యూఎల్ఈడీ టీవీల కొనుగోలుదారులకు ఉచితంగా అమెజాన్ ఎకో ప్లస్, 4కే యూహెచ్డీ టీవీతో అమెజాన్ ఎకో డాట్ ఫ్రీగా ఇస్తున్నాం‘ అని భుటాని తెలిపారు. తామూ అకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లు అందిస్తున్నట్లు రాయ్ వివరించారు. -
ఫ్లిప్‌కార్ట్ సేల్ : టీవీలపై భారీ డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్లో భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను అలరించడానికి ఈ-కామర్స్ దిగ్గజాలు వచ్చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో మెగా సేల్ ఈవెంట్లను నిర్వహించబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 20 నుంచి 24 వరకు తన బిగ్ బిలియన్ డేస్ సేల్కు శ్రీకారం చుట్టబోతుంది. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లపై 70 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. దీనిలో 32 అంగుళాల టీవీలు, స్మార్ట్ టీవీలుంటాయని, అంతేకాక ఆల్ట్రా హెచ్డీ 4కే టీవీలపై 40 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ చెప్పింది. బిగ్ స్క్రీన్ టీవీలపై అయితే ఏకంగా రూ.70వేల వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఫ్యాషన్, లైప్స్టయిల్లో ఇంతకముందు ఎన్నడూ చూడని 500 ప్లస్ బ్రాండులను కంపెనీ ప్రవేశపెట్టబోతుంది. గాడ్జెట్లు, అప్లియెన్స్ వంటి అన్ని రకాల ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్లతో మారుమోగించబోతుంది. ఇప్పటికే ఆసుస్, మోటోరోలా, హెచ్‌టీసీ బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై రాయితీలతో పాటు, శాంసంగ్ గెలాక్సీ ఎస్7, రెడ్మి 4ఏ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోయే ఈ సేల్కు పోటీగా అమెజాన్ ఇండియా, పేటీఎం మాల్‌లు కూడా మెగా సేల్ ఈవెంట్లకు తెరలేపబోతున్నాయి.