ఈ టెక్‌ కంపెనీ మొదలెట్టేసింది.. 5,600 మంది తొలగింపు! | Cisco To Cut 5600 Jobs In Latest Round | Sakshi
Sakshi News home page

ఈ టెక్‌ కంపెనీ మొదలెట్టేసింది.. 5,600 మంది తొలగింపు!

Published Wed, Sep 18 2024 9:23 PM | Last Updated on Thu, Sep 19 2024 10:09 AM

Cisco To Cut 5600 Jobs In Latest Round

టెక్ దిగ్గజం సిస్కో చెప్పినట్టే ఉద్యోగుల తొలగింపులు మొదలెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 7 శాతం అంటే సుమారు 5,600 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతూ మరో రౌండ్ తొలగింపులను ప్రకటించింది.

సిబ్బందిని తగ్గించే ప్రణాళికలను గత ఆగస్ట్ లోనే సిస్కో సూచించింది. అయితే ఏ వ్యక్తులు లేదా విభాగాలు ప్రభావితం అవుతాయో కంపెనీ పేర్కొనలేదు. స్పష్టత లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. తొలగింపుల గురించి ఉద్యోగులకు సెప్టెంబరు మధ్యలోనే సమాచారం అందింది.

టెక్ క్రంచ్ నుండి వచ్చిన నివేదిక సిస్కోలో పని వాతావరణం అధ్వాన్నంగా ఉందని వెల్లడించింది. ఇక్కడి పని వాతావరణాన్ని చాలా మంది ఉద్యోగులు విషపూరితంగా అభివర్ణించారు. తొలగింపులు సిస్కో థ్రెట్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ రీసెర్చ్ డివిజన్ అయిన టాలోస్ సెక్యూరిటీపై ప్రభావం చూపాయని నివేదిక పేర్కొంది.

ఇదీ చదవండి: ఆర్నెళ్లు ఆలస్యం.. యాక్సెంచర్‌ ఉద్యోగులకు  బ్యాడ్‌ న్యూస్‌

ఓ వైపు ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ కంపెనీ రికార్డ్‌స్థాయి లాభాల్లో కొనసాగుతోంది. సుమారు 54 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో 2024 "రికార్డులో రెండవ బలమైన సంవత్సరం" అని కంపెనీ నివేదించింది. లేఆఫ్ ప్రకటన వెలువడిన రోజునే ఈ ఆర్థిక నివేదిక విడుదలైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరిలోనూ సిస్కో 4,000 మంది ఉద్యోగులను తొలగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement