Cisco Systems
-
ఈ టెక్ కంపెనీ మొదలెట్టేసింది.. 5,600 మంది తొలగింపు!
టెక్ దిగ్గజం సిస్కో చెప్పినట్టే ఉద్యోగుల తొలగింపులు మొదలెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 7 శాతం అంటే సుమారు 5,600 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతూ మరో రౌండ్ తొలగింపులను ప్రకటించింది.సిబ్బందిని తగ్గించే ప్రణాళికలను గత ఆగస్ట్ లోనే సిస్కో సూచించింది. అయితే ఏ వ్యక్తులు లేదా విభాగాలు ప్రభావితం అవుతాయో కంపెనీ పేర్కొనలేదు. స్పష్టత లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. తొలగింపుల గురించి ఉద్యోగులకు సెప్టెంబరు మధ్యలోనే సమాచారం అందింది.టెక్ క్రంచ్ నుండి వచ్చిన నివేదిక సిస్కోలో పని వాతావరణం అధ్వాన్నంగా ఉందని వెల్లడించింది. ఇక్కడి పని వాతావరణాన్ని చాలా మంది ఉద్యోగులు విషపూరితంగా అభివర్ణించారు. తొలగింపులు సిస్కో థ్రెట్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ రీసెర్చ్ డివిజన్ అయిన టాలోస్ సెక్యూరిటీపై ప్రభావం చూపాయని నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: ఆర్నెళ్లు ఆలస్యం.. యాక్సెంచర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ఓ వైపు ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ కంపెనీ రికార్డ్‌స్థాయి లాభాల్లో కొనసాగుతోంది. సుమారు 54 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో 2024 "రికార్డులో రెండవ బలమైన సంవత్సరం" అని కంపెనీ నివేదించింది. లేఆఫ్ ప్రకటన వెలువడిన రోజునే ఈ ఆర్థిక నివేదిక విడుదలైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరిలోనూ సిస్కో 4,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
సందర్భం: నెట్వర్కింగ్ క్వీన్..జయశ్రీ ఉల్లాల్
‘భవిష్యత్ అనేది మూసిపెట్టిన పెట్టెలాంటిది. అందులో నీ కోసం ఎన్నో అద్భుతాలు ఎదురు చూస్తుంటాయి’ అనే ఆంగ్ల సినిమా డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటే ‘అవును. నిజమే’ అని చాలా సందర్భాలలో అనిపిస్తుంది. ఫోర్బ్స్ ‘అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్‌మేడ్ ఉమెన్’ జాబితాలో చోటు సాధించిన జయశ్రీ ఉల్లాల్ విజయాలను చూస్తే ఆ డైలాగ్‌లోని సత్యం మరింత బలపడుతుంది. ఊహకు కూడా అందని అద్భుతాలు ఆమె జీవితంలో జరిగాయి... లండన్‌లో పుట్టిన జయశ్రీ దిల్లీలో పెరిగింది. శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, శాంటా క్లారా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే నెట్వర్కింగ్ హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘సిస్కో’లో చేరింది. ‘అలా జరుగుతుందనుకోలేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది జయశ్రీ. ఆ కంపెనీలో ఆమె కాంట్రాక్ట్ రెండు సంవత్సరాలే. అయితే పదిహేను సంవత్సరాలు ఆ కంపెనీతో కలిసి నడిచింది. కంపెనీ సీయివో జాన్ చాంబర్, తన బాస్ మారియో మజోలా విలువైన ప్రోత్సాహం తో ‘జీరో’ స్థానంలో ఉన్న కంపెనీని లాభాల బాటలోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరింది. ‘ఈ స్థాయికి వస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు’ అంటుంది వినమ్రంగా జయశ్రీ. నిజమే మరీ, అది నల్లేరు మీద నడకలాంటి ప్రయాణం కాదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే కత్తి మీద సాము. తన తెలివితేటలు, వ్యూహాలు, దార్శనికతను ఏకం చేసి కంపెనీకి శక్తి ఇచ్చింది. తనలోని ‘శక్తి’ని కంపెనీ గుర్తించేలా చేసుకుంది. మూడు దశాబ్దాల నెట్వర్కింగ్ అనుభవం ఉన్న జయశ్రీ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (2015), వరల్డ్స్ బెస్ట్ సీయివో (2018) అవార్డ్లు అందుకుంది. ‘టెక్ల్యాండ్ అనేది పురుషుల ప్రపంచం అనే భావన ఉంది’ అనే సందేహానికి జయశ్రీ స్పందన: ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబజీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. ‘సిస్కో’లో పనిచేసే కాలంలో కొన్ని నెలల పాటు ప్రసూతి సెలవులు తీసుకుంది. ఆ సమయంలో డోలాయమాన స్థితిలో ఉండిపోయింది. ‘ఒక బిడ్డకు తల్లిగా ఉండిపోవాలా? తిరిగి ఉద్యోగంలో చేరాలా?’ ‘ఇంటికే పరిమితమై మాతృత్వాన్ని ఆస్వాదించాలి’ అని కొన్నిసార్లు...‘మళ్లీ ఉద్యోగం చేయాల్సిందే. నేను సాధించాల్సింది ఎంతో ఉంది’ అని కొన్నిసార్లు అనిపించేది. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాతో ఒక బిడ్డకు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు కెరీర్లో దూసుకుపోయింది. జయశ్రీ భర్త సెమికండక్టర్–ఇండస్ట్రీలో హైటెక్ ఎగ్జిక్యూటివ్. అలా అని ఇంట్లో సాంకేతిక కబుర్లు మాత్రమే వినిపిస్తాయి అనుకోవద్దు. దంపతులిద్దరూ ఇద్దరు కూతుళ్లతో సరదా సరదాగా గడుపుతారు. బాలీవుడ్ సినిమాలు తెగ చూస్తారు. హాయిగా పాటలు పాడుకుంటారు. వీటి ద్వారా వృత్తికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన విభజన రేఖను ఏర్పాటు చేసుకోగలిగారు. ప్రస్తుతం కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ ‘అరిస్టా’కు ప్రెసిడెంట్‌గా... సీయీవోగా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ, ఆ సంస్థను శక్తిమంతం చేయడం ద్వారా తనలోని ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. ఆహారం, కుటుంబ విలువలు, సంస్కృతి పరంగా తనను తాను భారతీయురాలిగా చెప్పుకునే జయశ్రీ బిజినెస్ ఫిలాసఫీకి సంబంధించిన ఆలోచనా విధానంలో మాత్రం తాను ‘గ్లోబల్ సిటిజన్’ అంటుంది. ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. -
నిరుద్యోగులకు శుభవార్త, ఉచితంగా ఐటీ కోర్సులపై శిక్షణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ రంగంలో మానవ వనరులను తీర్చిదిద్దేందుకు సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) చేతులు కలిపాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో లక్షలాది మందికి ఉద్యోగావకాశాలను కల్పించడం లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదిరింది. ఈ-స్కిల్ ఇండియా వేదిక ద్వారా సిస్కో నెట్వర్కింగ్ కోర్సులు ఉచితం లభిస్తాయి. -
ఏడాదిలో రెట్టింపైన టెలికాం రంగం ఉద్యోగాలు
టెలికాం రంగంలో త్వరలో రాబోయే 5జీ టెక్నాలజీ వల్ల 2020 నాల్గవ త్రైమాసికం, 2021 మొదటి త్రైమాసికంలో ఉద్యోగాల నియామకం రెట్టింపు అయినట్లు డేటా అండ్ ఎనలిటిక్స్ సంస్థ గ్లోబల్‌డేటా తన నివేదికలో వెల్లడించింది. కొత్త తరం టెక్నాలజీ 5జీపై మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు, ప్రభుత్వం ట్రయల్స్, టెస్టింగ్ కోసం అనుమతించినట్లు తెలిపింది. 5జీ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న నెట్వర్క్ ఎలిమెంట్స్‌కి అనుసంధానించాలని కంపెనీలు చూస్తున్నాయి. "2020 నాల్గవ త్రైమాసికంలో, 2021 మొదటి త్రైమాసికంలో మధ్య ఉద్యోగాల నియామకం రెట్టింపు అయ్యాయి. 5జీ డొమైన్లో నైపుణ్యం గల ఇంజనీర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. నెట్‌వర్క్‌లు, ఐపీ నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, ఫర్మ్‌వేర్, ఆటోమేషన్ వంటి రంగాలలో అనుభవం గల ఇంజనీర్లకు డిమాండ్ ఉన్నట్లు" గ్లోబల్‌డేటాలో బిజినెస్ ఫండమెంటల్స్ అనలిస్ట్ అజయ్ తల్లూరి తెలిపారు. టెలిఫోనాక్టిబోలాగేట్ ఎల్ఎమ్ ఎరిక్సన్(ఎరిక్సన్) భారతదేశంలో 2020 జనవరి 1 నుంచి కొత్తగా మరో 20 శాతం ఉద్యోగా నియామకాలను చేపట్టింది. ఎందుకంటే కంపెనీ సెల్యులార్, రేడియో నెట్వర్క్ అవకాశాలను పరిశీలిస్తుంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 5జీ ప్రాజెక్టుల కోసం సిస్కో సిస్టమ్స్ 5 బిలియన్ డాలర్ల(రూ.36,546 కోట్లు)ను పెట్టుబడి పెట్టింది. అందులో భాగంగానే 2020 1 జనవరి నుంచి కంపెనీ భారతదేశంలో మరో 30 శాతానికి కంటే ఎక్కువ శాతం ఉద్యోగ నియామకాలు చేపట్టింది. వర్చువలైజ్డ్ క్లౌడ్ సేవలను ప్రారంభించడానికి సిస్కో క్లౌడ్ కోర్, ప్యాకెట్ కోర్ కోసం ఇంజనీర్లను ఎంచుకుంటుంది. డెల్ టెక్నాలజీస్ (డెల్), క్వాల్కామ్ టెక్నాలజీస్ వంటి 5జీ డొమైన్లో భారీగా ఉద్యోగా నియామకాలు చేపడుతున్నాయి. అందుకే కేవలం ఒక ఏడాదిలో ఈ డొమైన్లో ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయినట్లు గ్లోబల్‌డేటా సంస్థ తన నివేదికలో పేర్కొంది. చదవండి: RockYou2021: ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి -
14వేలమంది ఉద్యోగులపై వేటు?
టెక్నాలజీ దిగ్గజం సిస్కో సిస్టమ్స్ ఇంక్ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయనుంది. నెట్వర్క్ పరికరాల తయారీలో ప్రపంచంలో దాదాపు 20 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న సిస్కో సుమారు 14,000 ఉద్యోగులను తొలగించనుందని సాంకేతిక వార్తల సైట్ సీఆర్ఎన్ రిపోర్టు చేసింది. దీనికి సంబంధించి త్వరలోనే సంస్థ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సన్నిహితవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ముందస్తు ఉద్యోగ విమరణ ప్యాకేజీలను ప్రకటించినట్టు తెలిపింది. సీఆర్ఎన్ నివేదించిన సమాచారం ప్రకారం సిస్కో డాటా ఎనలిటిక్స్ సాఫ్ట్ వేర్, డాటాసెంటర్ల కోసం క్లౌడ్ బేస్డ్ టూల్స్ పై పెట్టుబడులు పెడుతోంది. కాలిఫోర్నియాకు చెందిన సిస్కో హార్డ్‌వేర్ నుంచి సాఫ్ట్వేర్-సెంట్రిక్ సంస్థగా మార్పు చెందనున్న క్రమంలో రానున్న కొద్ది వారాల్లో కోతలు ప్రకటింవచ్చని అంచనా. కాగా గత ఏప్రిల్ వరకు 70వేల మంది ఉద్యోగులను కలిగి వున్న సిస్కో ఈ వార్తలపై స్పందించడానికి నిరాకరించింది. ఇదే ఏడాది రెండు ఇతర పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ , హెచ్‌పీ ఇంక్, ఉద్యోగంలో కోతలను ప్రకటించిన సంగతి తెలిసిందే.