ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్‌ఆర్‌ హెడ్‌ ఔట్‌! | Tesla's HR Head Allie Arebalo Exits Amid Layoffs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్‌ఆర్‌ హెడ్‌ ఔట్‌!

Published Thu, May 2 2024 8:30 AM | Last Updated on Thu, May 2 2024 9:50 AM

Tesla's HR Head Allie Arebalo Exits Amid Layoffs

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లాలో లేఆఫ్‌లు అలజడి సృష్టిస్తున్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వరుసపెట్టి కంపెనీని వీడుతున్నారు. తాజాగా టాప్ హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ అల్లి అరేబాలో కంపెనీని వీడారు.

అరేబాలో ఇక కంపెనీలో కనిపించరని, ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) చెప్పినట్లుగా మనీ కంట్రోల్‌ కథనం పేర్కొంది. నేరుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్‌కి రిపోర్టింగ్‌ చేసే హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆమె అంతట ఆమె కంపెనీని వీడారా.. లేక ఉద్యోగాల కోతలో భాగంగా ఉద్వాసనకు గురయ్యారా అనేది స్పష్టంగా తెలియలేదు. దీనిపై అటు మస్క్ గానీ, అరేబాలో గానీ స్పందించలేదు.

ఈ ఎలక్ట్రిక్-వెహికల్ మేకర్ కంపెనీ వ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను తగ్గిస్తోందని,  సుమారు 20 శాతం సిబ్బంది తగ్గింపును లక్ష్యంగా చేసుకుందని బ్లూమ్‌బెర్గ్ గత నెలలో నివేదించింది. టెస్లాలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా పేరున్న నలుగురిలో ఒకరైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డ్రూ బాగ్లినోతో సహా మస్క్ టాప్ లెఫ్టినెంట్లలో కొందరు కూడా కొన్ని వారాల క్రితం రాజీనామా చేశారు.

ఇటీవలి నెలల్లో వాహన విక్రయాలు క్షీణించడం ప్రారంభించినప్పటి నుండి ఖర్చుల కట్టడి, సిబ్బంది కోతపై ఎలాన్‌ మస్క్‌ దృష్టి పెట్టారు. టెస్లా ఛార్జింగ్ కనెక్టర్‌లను స్వీకరించే ప్రక్రియలో ఇతర ఆటోమేకర్‌లతో భాగస్వామ్యాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ సూపర్‌చార్జర్ టీమ్‌లో చాలా మందిని ఇప్పటికే తొలగించారు.  అరేబాలో కంపెనీలో అత్యంత సీనియర్ మహిళా ఎగ్జిక్యూటివ్‌లలో  ఒకరు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. 2023 ఫిబ్రవరి నుంచి ఈ పదవిలో ఉన్నారు. అలాగే సుమారు ఆరేళ్లుగా టెస్లాలో పనిచేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement