టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగాల తొలగొంపునకు పూనుకుంటున్నాయి. విమానయాన కంపెనీలు సైతం అదేబాటలో పయనమయ్యాయ. ఇటీవల ఎయిరిండియా కంపెనీ సంస్థలో 180 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
గత కొన్ని వారాల్లో 180 మందికి పైగా నాన్-ఫ్లయింగ్ సిబ్బందికి ఎయిరిండియా లేఆఫ్ ఇచ్చింది. ఈ ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాలు, పునర్‌నైపుణ్య అవకాశాలను వినియోగించుకోలేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 జనవరిలో ఎయిరిండియా పగ్గాలు చేపట్టిన తర్వాత.. వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు టాటా గ్రూప్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కొంతమంది సిబ్బందికి లేఆఫ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: గతేడాదితో పోలిస్తే అధికంగా విమానయానం.. ఎందరో తెలుసా..
Comments
Please login to add a commentAdd a comment