గూగుల్ సంస్థ అత్యాధునిక కృత్రిమమేధ (ఏఐ) టూల్ ‘జెమిని’ని గతేడాది డిసెంబరులో పరిచయం చేసింది. అయితే ఇటీవల ఈ టూల్ వెల్లడించిన సమాధానాలు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. దీనిపై కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. కొన్ని ప్రశ్నలకు జెమిని ఇచ్చిన ఫలితాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఆయనే స్వయంగా తెలిపారు.
ఈ ‘జెమిని’ ఎఫెక్ట్ ఇంటర్నెట్ వాడుతున్న వారిపై ఎక్కువ ప్రభావం ఉండకపోయినా దాన్ని తయారుచేసిన గూగుల్‌పై అయితే కచ్చితంగా ఉంటుంది. బూమింగ్ టెక్నాలజీకి సంబంధించి సరైన సమీక్ష లేకుండా ఇతరులతో పోటీపడాలనే తొందరలో ఉద్యోగులు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిస్తుంది.
ట్రస్ట్, సేఫ్టీ టీమ్‌దేనా బాధ్యత..
గూగుల్ ‘జెమిని’ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గూగుల్ తన ట్రస్ట్, సేఫ్టీ టీమ్ నుంచి కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. కంపెనీ తయారుచేసిన జెమినిలో సమస్యలు తలెత్తుతుండటంతో మిగిలిన వారిని స్టాండ్‌బైలో ఉండమని చెప్పినట్లు పేర్కొంది. మొత్తం 250 మంది ఉద్యోగులు కలిగిన ఈ గ్రూప్ నుంచి పదుల సంఖ్యలో ఉద్యోగాలు పోనున్నట్లు నివేదిక అంచనా వేసింది.
ఈ టీమ్ ఏం చేస్తుందంటే..
గూగుల్ ట్రస్ట్, సేఫ్టీ టీమ్ ఏఐ ఉత్పత్తుల నియమాలను తారుమారు చేసే సామర్థ్యం ఉన్న అవకాశాలను తగ్గించేలా పనిచేయాలి. అవసరమైన రూల్స్ సెటప్ చేసేందుకు ఈ టీమ్ బాధ్యత వహిస్తుంది. గూగుల్ యూజర్లు వినియోగించే టూల్స్ సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి పలు తనిఖీలను కూడా నిర్వహిస్తుంది.
ఇదీ చదవండి: ఆకతాయిల నుంచి రక్షించే లాకెట్.. ఎలాగంటారా..
జెమినిలో వరుసగా లోపాలు తలెత్తుతుండటంతో ఈ టూల్ ద్వారా మరిన్ని పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని గూగుల్ కొంతమంది ఉద్యోగులను కోరినట్లు నివేదిక పేర్కొంది. చారిత్రక చిత్రాలను చూపించడంలో జెమిని ఫెయిల్ కావడంతో ఈ వ్యవహారంపై కంపెనీ విచారణ జరుపుతుందని, దాంతో సిబ్బందిపై అధిక పనిభారం ఉన్నట్లు ఇటీవల కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment