TRAI Reliance Jio
-
జియో.. ఎయిర్టెల్ పోటాపోటీ
ఎయిర్టెల్ కంటే రిలయన్స్ జియో అక్టోబర్ 2024లో యాక్టివ్ యూజర్ల సంఖ్యను పెంచుకున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. అయితే ఇదే సమయంలో ఎయిర్టెల్ మాత్రం అధికంగా చెల్లింపులు చేసే 4జీ/ 5జీ యూజర్లను పెంచుకున్నట్లు పేర్కొంది.ఇప్పటివరకు ఉన్న మొత్తం యాక్టివ్ యూజర్ల విషయంలో జియోనే అధికంగా వినియోగదారులకు కలిగి ఉంది. ఇన్-యాక్టివ్ యూజర్ల తొలగింపు కారణంగా అక్టోబర్ నెలలో జియో సబ్స్క్రైబర్లను కోల్పోయినట్లు తెలిసింది. ఎయిర్టెల్ మాత్రం తన 4జీ/ 5జీ యూజర్ బేస్‌లో వృద్ధిని సాధించింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా 3జీ/ 4జీ యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. కాగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం స్వల్పంగా యూజర్లను పెంచుకుంది.ఇదీ చదవండి: పాప్‌కార్న్‌పై జీఎస్టీ.. నెట్టింట చర్చజులైలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను 10–27 శాతం వరకు పెంచాయి. అయితే బీఎస్ఎన్ఎల్ ప్రత్యర్థుల బాటను అనుసరించకపోగా.. సమీప భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపుదల ఉండబోదని బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి గతంలో స్పష్టం చేశారు. వినియోగదార్లను ఆకర్షించడానికి, మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు బీఎస్ఎన్ఎల్ ఇటీవల స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్, డైరెక్ట్–టు–డివైస్ తదితర సేవలను ప్రారంభించింది. -
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్
ముంబై: తారిఫ్ వార్‌లో రిలయన్స జియో విజయం సాధించింది. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ జియోకు క్లీన్ చిట్ ఇచ్చింది. రిలయన్స్ జియో ప్రకటించిన ఫ్రీ తారిఫ్ ఆఫర్లు జీవిత కాలం ఇవ్వడం సాధ్యం కాదని వాదించిన టెల్కోలకు షాకిస్తూ ట్రాయ్ జియోకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. జియో ప్రకటించిన వెల్కం ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ రెండూ ఫండమెంటల్ గా వేరువేరు అని తేల్చి చెప్పింది. రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్లలో ఎలాంటి తప్పులు దొర్లలేదని గతంలో ప్రకటించిన ట్రాయ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్రాయ భారతి ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ సహా ఇతర ఆపరేటర్లకు ఈ సమాచారాన్ని ట్రాయ్ అందించనుంది. కాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకాం తాజా ఆఫర్ పై టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, ఐడియా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ రిలయన్స్ జియో ఫ్రీ కాలింగ్ ఆఫర్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా శాశ్వత కాలం ఫ్రీగా ఇవ్వడం సాధ్యం కాదనీ దీన్ని నిరోధించాలంటూ టెలికాం ట్రిబ్యునల్ (టీడీఎస్‌ఏటి) ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సో.. తాజా హ్యాపీ న్యూయర్ ఆఫర్ ను జియో వినియోగదారులు నిస్సంకోచంగా అనుభవించవచ్చు. మార్చి 31, 2017 వరకు జియో ఆఫర్ చేసిన ఉచిత డ్యాటా, వాయిస్ సేవలను జియో లవర్స్ నిరభ్యంతరంగా ఎంజాయ్ చేయడానికి ట్రాయ్ అనుమతినిచ్చింది. సంబంధిత వార్తలు.. ఇంటి వద్దకే జియో సిమ్..ఎలానో తెలుసా? జియో తరువాతి డాటా ప్లాన్ ఏంటి? క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ జియో జియో డౌన్లోడు స్పీడులో దూసుకుపోయింది!