కాలుష్యం పెరుగుతోంది. బయట తిరిగే సమయాలూ పెరుగుతున్నాయి. ఎండ, దుమ్ము, రసాయనాల బారి నుంచి శిరోజాలను కాపాడుకోవాలంటే ఒక రక్షణ పొర అవసరం. జుట్టు రక్షణ ఇచ్చే పొర పేరు ‘సీరమ్!’ పొడిబారడం, కాంతిని కోల్పోవడం, చిట్లిన వెంట్రుకలు అధికమవడం... ఇవన్నీ జుట్టును నిర్జీవంగా మారుస్తున్నాయి. రకరకాల షాంపూలు, బ్లో డ్రయ్యర్లు, స్ట్రెయిటనింగ్ మెషీన్లు, స్టైల్ కోసం ఉపయోగించే జెల్స్.. జుట్టుపై మరింత ప్రభావం చూపుతున్నాయి. వీటన్నింటి నుంచి కేశాలను కాపాడే సుగుణం సీరమ్‌కు ఉంటుంది. అయితే నాణ్యత గల హెయిర్ సీరమ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి.
నోట్:1 డెర్మటాలజిస్ట్ లేదా ట్రైకాలజిస్ట్‌ను సంప్రదించి మీ శిరోజాల తత్త్వాన్ని తెలుసుకొని, తగిన హెయిర్ సీరమ్‌ను ఎంపిక చేసుకోవాలి.
నోట్:2 హెయిర్ సీరమ్ ఒకసారి వాడిన తర్వాత తలను శుభ్రపరుచుకున్నాకే మళ్ళీ వాడాలి. పదే పదే సీరమ్‌ని ఉపయోగించకూడదు.
నోట్:3 హెయిర్ సీరమ్‌ను కొద్దిగా వేళ్లకు అద్దుకొని జుట్టుకు రాసుకుని, దువ్వెనతో కుదుళ్ల దగ్గర నుంచి చివరల వరకు దువ్వాలి. అంతేకాని నూనెతో మసాజ్ చేసినట్టు సీరమ్‌ను మాడుకు పట్టించకూడదు.
హెయిర్ సీరమ్ ఎందుకంటే..?
Published Wed, Feb 5 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement