ఆరోగ్యకరమైన బీట్‌రూట్ రైస్ బాల్స్ ఇలా తయారు చేసుకోండి!
బీట్‌రూట్ రైస్ బాల్స్ తయారీకి కావలసినవి:
►బీట్‌రూట్ జ్యూస్ – ముప్పావు కప్పు
►రైస్ పౌడర్ – అర కప్పు
►►జొన్నపిండి – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
బీట్‌రూట్ రైస్ బాల్స్ తయారీ విధానం:
►ముందుగా బీట్‌రూట్ జ్యూస్‌లో కొద్దిగా ఉప్పు వేసుకుని.. చిన్న మంట మీద మరిగించాలి.
►అనంతరం రైస్ పౌడర్ వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి.
►దగ్గర పడే సమయంలో మళ్లీ జొన్నపిండి వేసి తిప్పుతూ ఉండాలి.
►బాగా దగ్గర పడిన తర్వాత చల్లార్చి.. చేతులకు నూనె రాసుకుని.. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
►వాటిని ఆవిరిపై బాగా ఉడికించుకుని.. కారంగా కావాలంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, ఆవాలు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని తాలింపు పెట్టుకోవచ్చు.
►తీపిగా కావాలంటే.. కొబ్బరికోరు, బెల్లంకోరు బాగా కలుపుకుని.. అందులో ఈ ఉండలను వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
ఇవి కూడా ట్రై చేయండి: Sesame Crusted Chicken: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్ చికెన్!
Maggi Vada: మ్యాగీ వడ.. ఇలా తయారు చేసుకోండి!
Comments
Please login to add a commentAdd a comment