Recipe: బీట్‌రూట్‌, డ్రై ఫ్రూట్స్‌తో కేక్‌ తయారు చేసుకోండిలా! | Recipes In Telugu: How To Prepare Beetroot Cheese Cake | Sakshi
Sakshi News home page

Beetroot Cheese Cake: బీట్‌రూట్‌, డ్రై ఫ్రూట్స్‌తో కేక్‌ తయారు చేసుకోండిలా!

Published Sat, Feb 18 2023 1:49 PM | Last Updated on Sat, Feb 18 2023 1:56 PM

Recipes In Telugu: How To Prepare Beetroot Cheese Cake - Sakshi

‍రొటీన్‌గా కాకుండా ఇలా బీట్‌రూట్‌ చీజ్‌ కేక్‌ తయారు చేసుకోండి! ఇంట్లోనే కొత్త రుచులు ఆస్వాదించండి!
కావలసినవి:
►వాల్‌నట్స్‌ – 150 గ్రాములు
►ఎండు అంజీరాలు – 8
►దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్‌ 
►ఉప్పు – చిటికెడు

►బీట్‌రూట్‌ తురుము – 300 గ్రాములు
►కోకోనట్‌ చీజ్‌ – 200 గ్రాములు
►కోకో పౌడర్, కొబ్బరి నూనె, నెయ్యి, మేపుల్‌ సిరప్‌ (మార్కెట్‌లో దొరుకుతుంది) – 4 టేబుల్‌ స్పూన్ల చొప్పున
►బాదం పాలు – 2 టేబుల్‌ స్పూన్లు
►పిస్తా పొడి – 3 టేబుల్‌ స్పూన్లు

తయారీ:
►ముందుగా వాల్‌నట్స్‌ని మిక్సీ పట్టుకోవాలి.
►అందులో ఎండు అంజీరాలు, దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్‌ స్పూన్ల కోకో పౌడర్‌ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని.. నెయ్యి కలిపి, పక్కన పెట్టుకోవాలి.
►అనంతరం బీట్‌ రూట్‌ తురుము, కోకోనట్‌ చీజ్, బాదం పాలు, 2 టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్‌ స్పూన్ల మేపుల్‌ సిరప్‌ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి.
►తర్వాత ఒక కేక్‌ ట్రేలో ముందు వాల్‌నట్‌ మిశ్రమాన్ని .. దానిపైన బీట్‌రూట్‌ మిశ్రమాన్ని పరచాలి
►కాస్త ఆరి, గట్టిపడిన తర్వాత ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.
►సర్వ్‌ చేసుకునే ముందు.. మిగిలిన కోకో పౌడర్, కొబ్బరి నూనె, మేపుల్‌ సిరప్‌ వేసుకుని బాగా కలిపి.. కోన్‌ మాదిరి కవర్‌లో చుట్టాలి.
►నచ్చిన డిజైన్‌లో కేక్‌ ముక్కలపై గార్నిష్‌ చేసుకుని.. వాటిపై పిస్తా పొడిని జల్లుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది. 

చదవండి: Keema Ragi Ponganalu: కీమా – రాగి పొంగనాలు తయారు చేసుకోండిలా!
Udupi Sambar: రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉడిపి సాంబార్‌ తయారీ ఇలా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement