![Corona Cant Stop My Zeal And Passion Says Satish Kaushik - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/24/Satish-Kaushik.jpg.webp?itok=PRlnYLDg)
ముంబై: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నివారించేందుకు గత కాలంగా సీనిమా షుటింగ్‌లను నిలిపివేశారు. తాజాగా సీనియర్ నటులకు సినిమా, షుటింగ్‌లో పాల్గొనవచ్చని బాంబే హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సినిమాలపై తమకున్న ఇష్టాన్ని, అభిరుచిని ఏ మాత్రం తగ్గించలేదని ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత సతీష్ కౌశిక్ సోషల్ మీడియాలో తెలిపారు. ఐదు నెలల తర్వాత పాల్గొన్న తాను పీపీఈ కిట్లను వేసుకుంటే ఏదో షూటింగ్‌లో పాల్గొన్న అనుభూతి కలుగుతుందని అన్నారు.
మరోవైపు సీరియల్ నటుడు అనిరుద్ దవే స్పందిస్తూ.. సినిమాలపై దిగ్గజ నటుడుకున్న ఆసక్తిని అనిరుద్ అభినందించారు. అయితే తమిళ్ సేతు చిత్రం, తెలుగులో శేషుగా బాలీవుడ్‌లో తేరే నామ్‌గా రీమేక్ చేశారు. బాలీవుడ్‌లో సతీష్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తేరే నామ్’ చిత్రంలో కండల వీరుడు బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్ హీరోగా నటించాడు. 2003లో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: అప్పుడు సల్మాన్ తటపటాయించాడు
Comments
Please login to add a commentAdd a comment