హీరో కొత్త బైక్స్‌, కొత్త టెక్నాలజీతో  | Hero launches three mororcycles- Passion Pro, Passion X Pro, and Super Splendor | Sakshi
Sakshi News home page

హీరో కొత్త బైక్స్‌, కొత్త టెక్నాలజీతో 

Published Thu, Dec 21 2017 1:22 PM | Last Updated on Thu, Dec 21 2017 3:55 PM

Hero launches three mororcycles- Passion Pro, Passion X Pro, and Super Splendor - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  హీరో మోటార్‌ కార్ప్‌ కొత్త మోటార్‌ సైకిళ్లను లాంచ్‌ చేసింది. పాషన్‌ ప్రో, పాషన్‌ ఎక్స్‌ ప్రో, సూపర్‌ స్ల్పెండర్‌ పేరుతో మూడు బైక్స్‌ను విడుదల చేసింది. ఐ3ఎస్‌ టెక్నాలజీతో అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా వీటిని అందుబాటులోకి తెచ్చింది. అయితే జనవరి 2018లో వీటి ధరను ప్రకటించనున్నట్లు హీరో మోటో వెల్లడించింది.  

సూపర్‌ స్ల్పెండర్‌ను 125 సీసీ ఇంజిన్‌, పాషన్‌ ప్రో, పాషన్‌ ఎక్స్‌ ప్రో మోడల్స్‌లో 110 సీసీ ఇంజిన్‌ను పొందుపర్చింది. దీని ఇంజిన్‌ 7500 ఆర్‌పీఎంవద్ద 8.4 పీఎస్‌ పవర్‌ను,  11ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. సూపర్‌ స్ల్పెండర్‌లో ఎయిర్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌, ఆటోమ్యాటిక్‌ హెడ్‌ ల్యాంప్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌, వైడర్‌ రియర్‌ టైర్‌, సీటు కింద ఎక్కువ  ప్లేస్‌ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

పాషన్‌ ప్రో, ఎక్స్‌ ప్రోలో ఆటోమ్యాటిక్‌ హెడ్‌ ల్యాంప్‌తోపాటు ఫ్యూయల్‌ లెవల్‌,  ట్రిప్‌ మీటర్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ తదితర వివరాలు అందించేలా డిజిటల్‌​ అన్‌లాగ్‌ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుపర్చింది. అయితే పాషన్‌  ప్రోతో  పోలిస్తే ఎక్స్‌ ప్రోను స్టయిలిష్‌గా తీర్చిదిద్దింది. స్కల్‌ప్‌డ్‌ ఫ్యూయల్‌ ఇంధన ట్యాంక్, డబుల్‌ టోన్ రియర్‌ మిర్రర్‌, ఎల్‌ఈడీ  టెయిల్‌   ల్యాంప్‌ అమర్చింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement