చుట్టుపక్కల వాళ్లంతా ఈ ఏజ్‌లో ఇవి నేర్చుకుంటున్నావా అని ఒకటే హేళన చేసేవారు ఆమెను. సోషల్ మీడియాలో సైతం ఈ వయసులో ఎందుకు మీకు..హాయిగా కృష్ణ.. రామా.. అనుకుంటూ కూర్చొక అన్న మాటలు వినిపిస్తున్నే ఉన్నాయి. అయినా లెక్కచేయకుండా ఉత్సాహభరితంగా తనకు నచ్చినవి అన్నీ చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు నీరూ సైనీ.
ఆమె హర్యానాలోని పంచకులకి చెందిన 54 ఏళ్ల నీరూ సైనీ . సమాజంలో వృద్దులు అంటే ఇలానే ఉంటారనే మూస భావనను బ్రేక్ చేసింది నీరూ. ఆమె 40 ఏళ్ల వయసులో డ్యాన్సులు, బైకింగ్, ట్రెక్కింగ్ వంటివి నేర్చుకుని ఆదర్శంగా నిలిచింది. నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే వయసు అడ్డంకి కాదని ప్రూవ్ చేసి చూపించింది. ఇంతకీ ఆమె ఈ వయసులో ఇలా ఇవన్నీ నేర్చుకోవడానికి గల కారణం ఏంటంటే..
చండీగఢ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నీరు కుంటుబ నేపథ్యం ఏంటంటే..నీరుకి 20 ఏళ్ల వయసులో పెళ్లయింది. ఆమె భర్త నేవీలో పనిచేస్తారు. ఆయనతో కలిసి సుమారు 26 దేశాలకు వెళ్లారు. అయితే ఆమె భర్తకు కేన్సర్ వచ్చిందని తెలిసిందో అప్పుడే ఆమె ప్రపంచం అంతా తలకిందులైపోయింది. 2000 సంవత్సరం అంతా నీరుకి బ్యాడ్ టైం అని చెప్పొచ్చు. భర్త మందులకే లక్షకు పైగా ఖర్చు అయ్యేది. ఎంతలా డబ్బు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆయన కేన్సర్‌తో పోరాడుతూ 2002లో మరణించారు.
అప్పటికి ఆమెకు నాలుగు, పది సంవత్సరాల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ భారం అంతా నీరుపై పడింది. భర్త చికిత్స కోసం దాచుకున్న డబ్బంతా ఖర్చు అయ్యిపోవడంతో ఒంటరిగా కూతుళ్లను పెంచడం ఆమెకు పెను భారమయ్యింది. అయినా అలానే ట్యూషన్, చెబుతూ కాలం వెళ్లదీసింది. ఈలోగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంది.
అలా ఆమె పదేహేనేళ్లు కూతుళ్ల బాధ్యతను నిర్వర్తించడంలోనే మునిగిపోయింది. నీరు పెద్ద కుమార్తె ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొంది మంచి ఉద్యోగం సంపాదించగా, చిన్న కుమార్తె కూడా మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యింది. ఇద్దరూ ఆమెను వదిలి విదేశాలకు వెళ్లిపోవడంతో ఒంటిరిగా అయిపోయింది నీలు. ఒక్కసారిగా వచ్చిపడ్డ ఒంటరితనం భరించలేకపోయింది. ఇది ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో అనూహ్యంగా బరువు తగ్గిపోయింది. ఆమె బాధను చూడలేక చిన్న కూతురు తల్లితో గడిపేందుకు ఒక ఏడాది సెలవు తీసుకోవాలని నిర్ణయించుకుంది.
ఆ టైంలోనే ధ్యానం చేయడం స్కూబా డ్రైవింగ్, స్కై డైవింగ్ వంటి సాహస క్రీడలపై దృష్టిసారించింది. తన కూతుళ్ల సాయంతోనే తనకు నచ్చినవన్నింటిన అలవోకగా నేర్చుకుంది. అంతేగాదు 52 ఏళ్ల వయసులో రెండు సోలో బైక్ రైడ్‌లను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఆమె చండీగఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా చేస్తూ ఇవన్నీ నేర్చుకుంది.
పైగా ప్రతి స్త్రీ తన కోసం తను జీవించాలని తన కలలను కొనసాగించాలని చెబుతోంది నీరు. వ్యక్తిగత జీవితంలోని విషాదం నుంచి తేరుకుని నిలదొక్కుకోవడమే గాక పిల్లల భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దింది. మళ్లీ జీవితంలో వచ్చి చేరిన శ్యూన్యతను చెదరగొట్టి కొత్త జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలిపింది. జీవితమనేది సవాలని దాన్ని నీకు నచ్చినట్లుగా మలుచుకుంటూ ముందుకు సాగిపోవాలని నీరు కథే చెబుతోంది కదూ..!.
(చదవండి: ప్రపంచ సంగీత దినోత్సవం: సంగీతం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదా..?)
Comments
Please login to add a commentAdd a comment