ఎత్నిక్ వేర్ షో
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: డిజైనర్ సృజనకు మోడల్స్ అద్దిన మెరుపులు ఆకట్టుకున్నాయి. విస్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్‌పీఎల్ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ది గ్రేట్ హైదరాబాద్ లైఫ్‌స్టైల్ ఎక్స్‌పో’లో భాగంగా కూకట్‌పల్లిలోని సుజనా ఫోరం మాల్‌లో శనివారం జరిగిన ఫ్యాషన్ షో ఆ కట్టుకుంది. సందర్శకులకు సరికొత్త డిజైన్లు పరిచయం చేసింది. ఎక్స్‌పోలోని అత్యాధునిక ఉత్పత్తులకు దీటుగా ఈ ఎత్నిక్ వేర్ షో నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.