హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తుల ఎగుమతులు దేశం నుంచి నవంబరులో 11.7 శాతం వృద్ధి చెందాయి. అంతర్జాతీయంగా ఉన్న సవాళ్ల నేపథ్యంలో గడిచిన కొన్ని నెలలుగా ఎగుమతులు తిరోగమనం చెందాయని అపారెల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తెలిపింది. ‘యూకే, ఈయూ, యూఎస్ వంటి సంప్రదాయ మార్కెట్లు మాంద్యం, ఎదురుగాలులు చవిచూస్తున్నందున దేశం నుంచి రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు దారుణంగా పడిపోయాయి.
ద్రవ్యోల్బణం, ముడిసరుకు, రవాణా ఖర్చులు పెరగడంతోపాటు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎగుమతిదారులపై భారం పెరిగింది. కొన్ని నెలల తర్వాత ఎగుమతులు సానుకూలంగా మారాయి. ప్రబలంగా ఉన్న సవాళ్లను ఎదుర్కోవడానికి పరిశ్రమకు ఉన్న స్థితిస్థాపకతను ఇది సూచిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దుస్తుల ఎగుమతి లక్ష్యం రూ.1.45 లక్షల కోట్లు. ఏప్రిల్–నవంబరులో రూ.82,740 కోట్లకుపైగా ఎగుమతులు నమోదయ్యాయి’ అని కౌన్సిల్ వివరించింది.
చదవండి: ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీబ్యాగర్ స్టాక్.. కలలో కూడా ఊహించని లాభం!
Comments
Please login to add a commentAdd a comment