సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌పై పోరుకు ఐఐటీ మద్రాస్‌లోని మ్యూజ్ వేరబుల్స్ సంస్థ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. వస్త్రాలపై కరోనా వైరస్ అంటుకోకుండా చేసే నానోస్థాయి కోటింగ్ పదార్థాన్ని అ భివృద్ధి చేసింది. ఎన్95 మాస్కులు మొదలుకొని సర్జికల్ మాస్కు లు, వ్యక్తిగత రక్షణ కిట్లు.. ఆహారాన్ని పార్శిల్ చేసేందుకు వాడే బ్యాగుల్లాంటి వాటిపై ఈ కొత్త పదార్థపు పూతను పూస్తే ఆ ఉపరితలంపై పడ్డ వైరస్ వెంటనే నిర్వీర్యమైపోతుంది. ఈ నానో పూత ఉన్న వస్త్రా న్ని సుమారు అరవైసార్లు ఉతికినప్పటికీ దాని ప్రభావం ఏమాత్రం తగ్గదు. మ్యూజ్ వేరబుల్స్ అభివృద్ధి చేసిన యంత్రం కొన్ని నిమిషా ల వ్యవధిలోనే దాదాపు వంద మీటర్ల నిడివి గల వస్త్రంపై నానో పూ త పూయగలదు. అంటే.. ఈ యంత్రాన్ని వెంటనే వాణిజ్యస్థాయిలో వాడుకోవచ్చన్నమాట. కోవిడ్–19పై పోరును వేగవంతం చేసే లక్ష్యంతో ఐఐటీ మద్రాస్ ఇచ్చిన పిలుపు మేరకు అక్కడి ఇన్‌క్యూబేషన్ సెల్‌లో ఏర్పాటైన సంస్థ మ్యూజ్ వేరబుల్స్.
ఈ సెల్‌లో బోలెడన్ని స్టార్టప్ కంపెనీలు కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు వేర్వేరు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నాయని.. వీటిల్లో చౌకగా లభించే వెంటిలేటర్లు మొదలుకొని వైరస్ ఉనికిని నిర్ధారించే పరీక్షలు కూడా ఉన్నాయని ఐఐటీ మద్రాస్ ఇన్‌క్యూబేషన్ సెల్ సీఈవో డాక్టర్ తమస్వతి ఘోష్ తెలిపారు. ప్రస్తుతం మ్యూజ్ వేరబుల్స్ కోటింగ్ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉందని, వేర్వేరు వస్త్రాలపై వేర్వేరు నానో పదార్థపు పూతను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే వారం రోజుల్లోనే నానో పూత తో కూడిన వస్త్రాలు అందుబాటులోకి రానున్నాయి. మాస్కులు తయారు చేసే కంపెనీతో కలసి నానోపూత కలిగిన, ఐదు పొరల మాస్కును సిద్ధం చేస్తోంది ఈ కంపెనీ. ఒక్కో మాస్కు ఖరీదు దాదా పు రూ.300 వరకూ ఉండవచ్చని అంచనా. కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఈ నానో పూత ఎంతో ఉపయోగపడుతుందని నానోపూత కలిగిన మాస్కును వాడితే వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువని మ్యూజ్ వేరబుల్స్ సీఈవో కేఎల్‌ఎన్ సాయి ప్రశాంత్ తెలిపారు. కరోనా వైరస్‌తోపాటు ముప్ఫై నానోమీటర్ల సైజున్న సూక్ష్మజీవులనూ ఈ కోటింగ్ నాశనం చేయగలదు.
Comments
Please login to add a commentAdd a comment